అన్వేషించండి

KTR News: స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్

Station Ghanpur News: పార్టీని పటిష్టం చేయడానికి త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయన్నారు.

Telangana News: త్వరలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పార్టీ మారిన ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన అనర్హతవేటు ఖాయమని, త్వరలోనే స్టేషన్ ఘనపూర్ కు ఉప ఎన్నికలు రానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తో నేడు కేటీఆర్ హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపైన తాటికొండ రాజయ్య పలు సలహాలు, సూచనలు కేటీఆర్ తో పంచుకున్నారు. పార్టీని మోసం చేసి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్ పూర్ లో ఓడించేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కడియం శ్రీహరికి బుద్ధి చెబుతాయన్నారు. 

ప్రజా క్షేత్రంలో బుద్ది చెబుతాం
ఇప్పటికే తాటికొండ రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికల అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  ప్రకటించిన నేపథ్యంలో ఆయన నాయకత్వంలో మరోసారి స్టేషన్ ఘన్ పూర్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ అన్నారు. పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి  త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులతో త్వరలోనే ఒక విస్తతస్ధాయి సమావేశాన్ని స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న మండల పార్టీ నాయకులతో మాట్లాడి తేదీలను నిర్ణయించాలని రాజయ్య గారికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అనేక అవకాశాలు ఇచ్చిన మూడు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత కూడా కేవలం రాజకీయ స్వార్థంతో పార్టీని వీడిన కడియం శ్రీహరికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు

హైకోర్టు కీలక తీర్చు
కాగా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై నెల రోజుల్లోగా చర్యలు చేపట్టేందుకు విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో సుమోటోగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానా నాగేందర్‌లపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
 

ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న
కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న మాదిరి కాంగ్రెస్‌ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల్లో వేల హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి ఇప్పుడు నేలచూపులు చూస్తున్నారని మండిపడ్డారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోయారని, రుణమాఫీ విషయంలోనూ మోసం చేశారని కుండ బద్దలు కొట్టారు. ఢిల్లీలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలు తెలంగాణ రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. వానాకాలంలో పెట్టుబడి సాయం ఉపసంహరించుకున్న కేటీఆర్ ఇప్పుడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేక చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీల్లోని ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నారని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి నీటి నిల్వ
కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి నీటి నిల్వ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget