Fatima Church Warangal: వరంగల్‌లో 80 ఏళ్లనాటి చర్చి, ప్రత్యేకతతో ఫాతిమా మాత మందిరం
Fatima Church: ఫాతిమా మాత చర్చి చెక్కుచెదరకుండా చారిత్రక కట్టడం గా కొనసాగుతోంది. తెలంగాణలోని అతి పెద్ద చర్చిలో ఒకటిగా ఏడు పత్రికలు ప్రత్యేకమైన ప్రార్ధనలు కొనసాగుతాయి.
Warangal Christmas Special: అత్యద్భుతమైన నిర్మాణ శైలిలో నిర్మించిన చర్చి వరంగల్ లోని ఫాతిమా మాత దేవాలయం. 80 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫాతిమా మాత దేవాలయం చెక్కుచెదరకుండా చారిత్రక కట్టడం గా కొనసాగుతోంది. తెలంగాణలోని అతి పెద్ద చర్చిలో ఒకటిగా ఏడు పత్రికలు ప్రత్యేకమైన ప్రార్ధనలు కొనసాగుతాయి.
విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా కనిపిస్తున్న ఈ చర్చ్ వరంగల్ నగరంలోని కాజీపేట ఫాతిమా ఫాతిమా మాత మందిరం. 1952 సంవత్సరంలో బ్రదర్ సాల, బిషప్ బరేట ఈ ఫాతిమామత మందిరాన్ని నిర్మించారు. తెలంగాణ లోని వరంగల్ ఖమ్మం జిల్లాలో ఈ మందిరం అత్యంత ఎత్తైనది. చర్చి నిర్మాణం ఈ మందిరంలో ఏసుక్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. అత్యంత నైపుణ్యంతో నిర్మించిన ఈ చర్చి అణువణువు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మందిరంలో ఒకేసారి 500 మంది వరకు భక్తులు కూర్చుని ప్రేయర్ చేయడానికి అణువుగా నిర్మాణం జరిగింది. టక టక రైమ్స్ డిసెంబర్ 24 అర్ధరాత్రి నుండి పాతిమా మాత మందిరం ఆవరణలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతాయి.
ఇక క్రిస్మస్ రోజు సుమారు 3 వేల మందితో ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం ప్రత్యేకత. 1950 దశకంలో వరంగల్ నగరానికి ఆనుకొని ఉన్న కాజీపేట ప్రాంతం అటవీ ప్రాంతం ఈ ప్రాంతంగా ఉండడం ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో పార్టీ మామాత కృపతో బ్రదర్ చాలా ఈ చర్చిని నిర్మించి ఈ ప్రదేశాన్ని దేవుడు ఆశీర్వదించారని చర్చి ఫాదర్ కాస్మారెడ్డి తెలిపారు. ఫాతిమా మాత ప్రార్థనలతో కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకమని ఫాదర్ చెప్పారు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ కాస్మారెడ్డి తెలియజేశారు.
ఈ దేవాలయంలో నిత్యం ప్రార్థనలు జరుగుతాయి. ఫాతిమా మాత కథోలిక్ దేవాలయంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీలు గ్రూపుగా వచ్చి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటామని యూత్ చెప్పారు. జీసస్ పుట్టినరోజు పురస్కరించుకొని ఎవరికి ఎన్ని బాధలు, సమస్యలు ఉన్న మర్చిపోయి ఆనందంగా గడుపుతామని ప్రియ చెప్పారు. 24 అర్ధరాత్రి దివ్యబలిపూజ చేసి క్రిస్మస్ కు స్వాగతం పలుకుతామని జయశ్రీ చెప్పారు. వరంగల్ నగరంలో క్రిస్మస్ వేడుకలకు కాజీపేట ఫాతిమా మాత దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఈ చర్చి ప్రత్యేకత.