Bheems Ceciroleo : ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా... కానీ ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎమోషనల్
Mass Jathara Pre Release Event : 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో స్పీచ్ అందరినీ కదిలిస్తోంది. ఒకప్పుడు అవకాశాలు లేక చనిపోదామని అనుకున్నట్లు ఆయన తెలిపారు.

Bheems Ceciroleo Emotional Speech At Mass Jathara Pre Release Event : మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్, అవకాశాల గురించి మాట్లాడిన ఆయన కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.
సూసైడ్ చేసుకుందామనుకున్నా
ఒకప్పుడు సరైన ఛాన్సెస్ లేక ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్లు భీమ్స్ తెలిపారు. 'నేను ఏ విషయాన్నైనా పాట రూపంలో తెలుపుతా. ఓసారి నా పరిస్థితి ఇదీ అని చెబుతూ నా భార్యాబిడ్డలు కనిపించేలా ఓ సెల్ఫీ వీడియో తీశా. నేను ఆ వీడియో ఎందుకు తీసుకున్నానో కూడా వాళ్లకు తెలియదు. హౌస్ రెంట్, పిల్లల చదువులు, వాళ్లను ఎలా పోషించాలి. ఎలా బతకాలి అని ఆలోచిస్తూ వీడియో తీశా. ఫైనల్‌గా చిట్టచివరి క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు పీపుల్ మీడియా ఆఫీస్‌కు రావాలి అని దాని సారాంశం.
ఆ కాల్ నా లైఫ్‌నే మార్చేసింది. ఆ కాల్ రావడానికి ఒక్క క్షణం ముందు నాకు జీవితం లేదు. భార్యా పిల్లలతో కలిసి చనిపోదాం అని అనుకున్నా. ఆ టైంలో నేను కొలిచే దేవుడి రూపంలో రవితేజ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆయనంటే మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే దానికి కారణం ఆయనే కారణం. ఆయనలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉంటే నాలాంటి వాళ్లు ఎంతోమంది పరిశ్రమకు వస్తారు. ఎంతోమందికి ఆయన స్ఫూర్తి. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ కామెంట్స్ అందరినీ కదిలించాయి.
ఆ తర్వాత రవితేజ స్పీచ్‌లోనూ రవితేజ మాట్లాడుతూ... భీమ్స్ మ్యూజిక్‌లో దూసుకెళ్తారని అన్నారు. 'మాస్ జాతర'లో ఆయన కంపోజ్ చేసిన అన్నీ పాటలు, బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయని ప్రశంసించారు. భీమ్స్ ఎమోషనల్ అవుతుండగా తనదైన కామెడీ డైలాగ్స్‌తో మందలిస్తూనే నవ్వించారు.
Also Read : కత్తి పోటు కన్నా వెన్ను పోటు చాలా ప్రమాదం - 'బాహుబలి: ది ఎపిక్' ట్రైలర్ 2 చూశారా?
అయితే, 2012లో వచ్చిన 'నువ్వా నేనా' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు భీమ్స్. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నారు. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో హిట్ సాంగ్స్ అందించి ఫుల్ ఫేం సంపాదించుకున్నారు. ప్రస్తుతం 'మాస్ జాతర'కు మాస్ మ్యూజిక్ అందించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతోన్న 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీకి సైతం భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'మీసాల పిల్ల' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.





















