Baahubali The Epic Trailer : కత్తి పోటు కన్నా వెన్ను పోటు చాలా ప్రమాదం - 'బాహుబలి: ది ఎపిక్' ట్రైలర్ 2 చూశారా?
Baahubali The Epic : కాళకేయులతో బాహుబలి, భళ్లాలుని యుద్ధం... భళ్లాలునితో అమరేంద్ర బాహుబలి కుమారుడు శివుని పోరాటం... మెయిన్ సీన్స్ హైలెట్ చేస్తూ తాజాగా 'బాహుబలి: ది ఎపిక్' ట్రైలర్ అదిరిపోయింది.

Prabhas's Baahubali The Epic Latest Trailer : 'నన్ను ఎప్పుడూ చూడని కళ్లు దేవుడిలా చూస్తున్నాయి. నేనెవరిని?'... 'మా దేవుడు అమరేంద్ర బహుబలి రక్తానివి నువ్వు', 'కత్తి పోటు కన్నా వెన్ను పోటు చాలా ప్రమాదకరం'... ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది... ఈ డైలాగ్స్ ఏ మూవీలోనివో. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ది లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం 'బాహుబలి'. పదేళ్లు పూర్తైన సందర్భంగా రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా 'బాహుబలి : ది ఎపిక్'గా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటుండగా తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీం.
ట్రైలర్ 2... అన్నీ క్వశ్చన్స్‌కు ఆన్సర్
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?'... 'బాహుబలి ది బిగినింగ్' క్లైమాక్స్‌లో ఓ సస్పెన్స్‌తో హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి. అదే హైప్ దాదాపు రెండేళ్లు కొనసాగింది. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో అమరేంద్ర బాహుబలి రాజసం, శివుడు తన తండ్రి గురించి తెలుసుకోవడం సహా కాళకేయులతో యుద్ధం, పిండారీలను అంతం చేయడం వంటి అంశాలను చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు.
'నా ఇద్దరు బిడ్డలకు ఈ మాహిష్మతి సింహాసనంపై సమాన హక్కులు ఉన్నాయి. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడు అవుతారో? ఎవరు దేశ ప్రజల మన్ననలు పొందుతారో? వారే మహారాజు అవుతాడు.' అంటూ రాజమాత శివగామి చెప్పడం... భళ్లాల దేవుడు, బాహుబలి ఎలివేషన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. తన తండ్రిని చంపిన భళ్లాలుడితో శివుడు యుద్ధాన్ని కూడా ట్రైలర్లో అద్భుతంగా చూపించారు.
Also Read: స్టేజ్‌పై రవితేజ, శ్రీలీల డ్యాన్స్ - సూర్య ముఖ్య అతిథిగా 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్
'బాహుబలి : ది ఎపిక్' రన్ టైం 3 గంటల 44 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. రెండు పార్టుల్లోని కొన్ని సీన్స్, సాంగ్స్‌ను తొలగించి దర్శకుడు రాజమౌళి రన్ టైం లాక్ చేశారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు మూవీ రానుండగా ఇప్పటికే బుకింగ్స్ సైతం ఓపెన్ అయ్యాయి. ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇప్పటికే ప్రోమోస్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటున్నాయి. మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విశేషాలను ముగ్గురూ గుర్తు చేసుకున్నారు. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూను రిలీజ్ చేయనున్నారు.
2015లో రిలీజైన 'బాహుబలి : ది బిగినింగ్' రూ.650 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా... 'బాహుబలి : ది కంక్లూజన్' రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్, రానాలతో పాటు అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Here’s #BaahubaliTheEpic Release Trailer 2. https://t.co/ckeqjeCSAH #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/uqR2NsQsvQ
— Baahubali (@BaahubaliMovie) October 29, 2025





















