Aaryan Movie: 'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
Aaryan Release Date : 'మాస్ జాతర', 'బాహుబలి : ది ఎపిక్' మూవీస్ కోసం కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ తన మూవీ రిలీజ్ వారం వాయిదా వేసుకున్నారు. ఆయన నటించిన 'ఆర్యన్' తెలుగు వెర్షన్ లేట్‌గా రానుంది.

Vishnu Vishal's Aaryan New Release Date Locked : కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఆర్యన్'. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళం భాషల్లో ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజున 'బాహుబలి ది ఎపిక్', రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ ఉండడంతో తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా వేసినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ మేరకు హీరో విష్ణు విశాల్ ఓ నోట్ రిలీజ్ చేశారు.
మూవీ రేస్ కాదు... వేడుక
సినిమా అనేది రేస్ కాదని... అది ఓ వేడుక అని విష్ణు తెలిపారు. 'ప్రతీ వేడుకకు ఓ ప్రత్యేక స్థానం, విలువ ఉండాలి. మా చిత్రం 'ఆర్యన్' ఈ నెల 31న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ స్పెషల్ డేట్ మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర', పవర్ ఫుల్ 'బాహుబలి ది ఎపిక్' మీ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకమైంది. నేను ఎప్పటి నుంచో రవితేజ ఫ్యాన్‌ను. ఆయన ఆన్ స్క్రీన్ ఎనర్జీనే కాక వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. అలాగే, దర్శక ధీరుడు రాజమౌళి గారికి నేను లైఫ్ టైం ఫ్యాన్‌ను. ఈ వారం వారి మూవీస్ సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని నేను భావిస్తున్నా.
ఆర్యన్ సినిమా తమిళంలో రిలీజ్ అయిన వారం తర్వాత అదే థ్రిల్, పాషన్‌తో నవంబర్ 7న తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్‌కు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నా డెసిషన్‌కు అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్స్ సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు స్పెషల్ థాంక్స్. నా సినిమా తనకంటూ ఓ మంచి స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. తెలుగు ఆడియన్స్ కోసం విభిన్నమైన సినిమాలు అందించాలనే నా ప్రయత్నంలో ఇది ఒక మంచి ప్రారంభం అవుతుందని నేను నమ్ముతున్నా.' అంటూ నోట్‌లో పేర్కొన్నారు.
Also Read : ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా... కానీ ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎమోషనల్
మూవీలో విష్ణు విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విష్ణు కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 31న తమిళ వెర్షన్ రిలీజ్ కానుండగా... తెలుగులో వారం ఆలస్యంగా అంటే నవంబర్ 7న విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.





















