News
News
వీడియోలు ఆటలు
X

Waranagal Preethi Case : ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం, ఛార్జ్ షీట్ లో మరికొందరి పేర్లు- విద్యార్థిని తండ్రి నరేందర్

Waranagal Preethi Case : వరంగల్ కాకతీయ వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో ఆమె కుటుంబ సభ్యులు వరంగల్ సీపీని కలిశారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని ఆమె తండ్రి నరేందర్ తెలిపారు.

FOLLOW US: 
Share:

 Waranagal Preethi Case : కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ను కలిశారు.  అనంతరం ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడుతూ..  సీపీతో మాట్లాడి మా అ‌నుమానాలు నివృత్తి చేసుకున్నామన్నారు.  ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని చెప్పారు. సిరంజి దొరికిందని సీపీ చెప్పారని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ రిపోర్ట్ చూపించలేదని తెలిపారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామన్న ఆయన... ఛార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారని తెలిపారు.  కేఏంసీ ప్రిన్సిపాల్, హెచ్వోడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటు‌న్నామన్నారు. 

సైఫ్ వేధింపులే ప్రీతి ఆత్మహత్యకు కారణం- సీపీ రంగనాథ్  

మెడికల్ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి పోస్టుమార్టం నివేదిక వచ్చిందని, ఇందులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీటును దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సీనియర్ సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ప్రీతి బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ నకు కోర్టును బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 19వ తేదీన షరతులకో కూడి బెయిల్ ఇచ్చారు. అయితే పూచీకత్తు, సంతకాల విషయంలో జాప్యం జరగడంతో విడుదల ఆలస్యమైందన్నారు. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్ ను పోలీసులు గురువారం వరంగల్ కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ ఉత్తర్వుల కాపీ వరంగల్ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో సైఫ్ ను కోర్టు నుంచి ఖమ్మం జైలుకు తీసుకువచ్చి సంతకాలు తీసుకొని సాయంత్రం ఆరు గంటల సమయంలో సైఫ్ ను విడుదల చేశారు.  

అసలేం జరిగిందంటే..?

గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది. మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషపు ఇంజెక్షన్ చేశారని.. డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించి ట్రీట్మెంట్ చేశారంటూ ప్రీతి తండ్రి, సోదరుడు ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదన్నారు. ఫిబ్రవరి 26 రాత్రి ప్రీతి బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు

Published at : 22 Apr 2023 02:38 PM (IST) Tags: Warangal Kakatiya Medical college Preethi father CP Ranganath Preethi case

సంబంధిత కథనాలు

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Ponguleti : కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన

Ponguleti :  కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

టాప్ స్టోరీస్

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!