News
News
X

Warangal News : ఆ ఊరంతా చిరంజీవులే, మరణించినా చూస్తూనే ఉంటారు!

ముచ్చర్ల ప్రజల చైతన్యం చుట్టుపక్కల ఆరు గ్రామాలకు విస్తరించింది. ఒక్కరితో మొదలైన నేత్రదానం ఊరందరినీ అదే మార్గంలో నడిచేలా చేసింది. చూపు కోల్పోయిన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

FOLLOW US: 

భౌతికంగా లేకపోయినా నేత్రదానం చేసి చూపు కరువైన వారిని అంద విముక్తులను చేస్తున్నారు. ఊరు మొత్తం నేత్రదానం చేయాలనే సంకల్పంతో చిరంజీవులుగా వెలుగొందుతూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్కరూ ఇద్దరు కాదు ఊరంతా ఒక్కటై ఉన్నతమైన ఆశయంతో సమాజానికి మార్గం చూపుతున్నారు. ఆ ఊరి వాళ్ల కళ్లకు మరణమనేదే లేదు.. చూస్తూ.. చూపిస్తూనే ఉంటాయి... ఊరు మొత్తం నేత్రదానం చేసేందుకు అంగీకారం తెలిపిన గ్రామం పై ప్రత్యేక కథనం. 

మరణించిన చూస్తున్నారు

పుట్టిన ప్రతీ మనిషి గిట్టక తప్పదు. కోటీశ్వరులైనా.. కూటికి గతి లేని కటిక దరిద్రులైనా మరణించిన తర్వాత మట్టిలో కలిసి పోవాల్సిందే. అయితే.. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మరి అలాంటి కనులు కూడా.. మనతో పాటే మట్టిలో కలిసిపోతే ఎలా..? మనం లేకపోయినా.. మన కళ్లు మాత్రం ఈ ప్రపంచాన్ని చూస్తూ.. చూపిస్తూనే ఉండాలి. ఇలాంటి స్ఫూర్తిదాయక నినాదంతో ముందుకెళ్తూ.. వారి కనులకు మరణమనేదే లేకుండా చూసుకుంటున్నారు హనుమకొండ జిల్లాలోని ముచ్చర్ల గ్రామస్థులు..

ఆ ఊరుకు మరణం లేదు.

News Reels

ఆఊరి కళ్లకు మరణం లేదు. మనిషి మరణించినా సరే.. వారి కళ్లు మాత్రం నిరంతరాయంగా ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి. మరణించిన వ్యక్తుల కళ్ళు చూడడమేంటని అనుకుంటున్నారా? అదే.. ఆ ఊరి ప్రత్యేకత. దానాలలోకెల్లా నేత్రదానం గొప్పదంటారు. ఎందుకంటే అన్నదానం చేస్తే ఒకపూట మాత్రమే కడుపు నింపగలం. అదే నేత్రదానం చేస్తే.. ఓ వక్తికి జీవితాంతం ఈ ప్రపంచాన్ని చూసే అద్భుత అవకాశాన్ని ఇచ్చినవారిమవుతాం. ప్రపంచంలోని అందాలను, ఆనందాలను పంచినవారవుతాం. అదే.. సందేశాన్ని ఆ ఊరి గ్రామస్థులంతా ఫాలో అవుతున్నారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆలోచనే.. ఆ ఊరిని నేత్రదానం వైపు మళ్లించింది. తమ కళ్లతో వంద మందికి పైగా చూపును ప్రసాదించేలా చేసింది. ఆ ఊరే.. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామం...

పది మందిని వెలుగులోకి

కంటి చూపు లేకుంటే బతుకంతా చీకటిమయమే. అలాంటి చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు ముచ్చర్ల గ్రామ ప్రజలు. అంధత్వ నివారణకు నడుంబిగించి, మరణించినా వ్యక్తి మట్టిలో కలిసిపోయినా, వారి కళ్ళు ప్రపంచాన్ని చూసేలా చేస్తున్నారు. గ్రామంలో ఈ నేత్రదాన ఉద్యమం 2013లో మొదలైంది. నేత్రదానం చేద్దాం మరొకరికి చూపునిద్దాం అనే నినాదానికి ఆకర్షితులై ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో డీఈఈగా పని చేసే మండల రవీందర్ మొట్టమొదట తన తల్లి లక్ష్మీ కళ్లను దానం చేసి.. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 55 మంది కళ్లు సేకరించి మరో 110 మందికి చూపునిచ్చి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు..

రెండు వేల జనాభా లో 100మందికి పై గా..

ముచ్చర్ల గ్రామ జనాభా రెండు వేలు కాగా అందులో ఇప్పటికే సగం మంది నేత్రదానానికి అంగీకారం తెలిపారు. మరో వంద మందికి పైగా అవయవదానానికి ముందుకొచ్చారు. కుటుంబ సభ్యున్ని కోల్పోవడం బాధే అయినా.. వారి కనులు ఇంకొకరికి చూపునిస్తూ.. వారిలో బతికే ఉండటం సంతోషకరమైన అంశమంటున్నారు గ్రామస్తులు. నేత్రదానంకు అంగీకరించిన వారు చనిపోతే వారి మరణాంతరం కుటుంబసభ్యులు సమాచారం ఇస్తే 8 నుంచి 9 గంటలలోపు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సౌజన్యంతో మృతుల నుండి నేత్రాలు సేకరిస్తున్నారు. నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు సర్టిఫికెట్లు ప్రధానం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్లబ్ ఏర్పాటు చేసి నేత్రదానం, అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు నిర్వాహకులు..

నేత్రదానానికి అవిటితనం అడ్డుకాదని నిరూపిస్తున్నారు వికలాంగులు. పుట్టుకతోనే పోలియో బారిన పడ్డ సదాశివరెడ్డి నేత్రదానం చేసి గ్రామస్తులకు మరింత స్ఫూర్తి నింపాడు. కాళ్లు చచ్చుబడిపోయినా.. తన కళ్లు మాత్రం నిరంతరం ప్రపంచాన్ని చూడాలని సంకల్పించి నేత్రదానం చేశి.. మిగతావారికి ఆదర్శంగా నిలిచారు. ఇలా.. ఒకరిని చూసి మరొకరు నేత్రదానానికి ముందుకొస్తూ.. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. వివిధ కారణాలతో వారి కుటుంబ సభ్యులను కోల్పోయినవారు స్వయంగా ముందుకు వచ్చి నేత్రదానం చేస్తున్నారు. తాము మరణించినా.. తమ కనుల చూపు మాత్రం ఆగిపోకూడదంటున్నారు. ఇప్పటి వరకు 55 మంది మరణించిన తర్వాత వారి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ముచ్చర్ల ప్రజల చైతన్యం చుట్టుపక్కల ఆరు గ్రామాలకు విస్తరించింది. ఒక్కరితో మొదలైన నేత్రదానం ఊరందరినీ అదే మార్గంలో నడిచేలా చేసింది. చూపు కోల్పోయిన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది...

Published at : 17 Nov 2022 04:21 PM (IST) Tags: Eye Donation TS News Warangal News Mucharla

సంబంధిత కథనాలు

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

Kamareddy News : సోది క్లాస్ అంటూ ఇన్ స్టాలో స్టూడెంట్స్ పోస్ట్, పచ్చికట్టెలు విరిగేలా కొట్టిన టీచర్!

Kamareddy News : సోది క్లాస్ అంటూ ఇన్ స్టాలో స్టూడెంట్స్ పోస్ట్, పచ్చికట్టెలు విరిగేలా కొట్టిన టీచర్!

టాప్ స్టోరీస్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు