అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kakatiya University : కాకతీయ వర్సిటీ వీసీ, రిజిస్టార్ పై ధిక్కరణ కేసు, లోకాయుక్త ఉత్తర్వులు అమలులో నిర్లక్ష్యం!

Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ వీసీ, రిజిస్టార్, మాజీ రిజిస్టార్, పలువురిపై లోకాయుక్తలో ధిక్కరణ కేసు నమోదు అయింది.

Kakatiya University : వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ పై లోకాయుక్తలో ధిక్కరణ కేసు నమోదు అయింది. లోకాయుక్త ఉత్తర్వులను అమలు చేయలేదని కాకతీయ యూనివర్సిటీ మాజీ ఇంగ్లీష్ హెచ్వోడీ ఈ. రేణుక లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుతో ఈనెల 4న కాకతీయ వర్సిటీ వీసీతో సహా మరో ముగ్గురిపై లోకాయుక్త ధిక్కరణ కేసు నమోదు అయింది. ఇటీవల వీసీ తాటికొండ రమేష్ తో పాటు మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ రాజయ్యపై కేయూ పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు కావడం మళ్లీ ఇప్పుడు వీసీ తో పాటు, ఇప్పటి రిజిస్ట్రార్ టి.శ్రీనివాస్, మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి, ఏ.ఆర్. పెండ్లి అశోకబాబులపై లోకాయుక్తలో ధిక్కరణ కేసు నమోదు కావడంతో యూనివర్సిటీలో చర్చనీయాంశం అయింది. 

నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు 

కాకతీయ యూనివర్సిటీలో 2017, 2018, 2021లో టీచర్ల పదోన్నతులు చేపట్టారు. 2017లో అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లగా 9 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లగా ముగ్గురు పదోన్నతి పొందారు. అదేవిధంగా 2018లో అసోసియేట్ నుంచి ప్రొఫెసర్లగా ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లగా 20 మంది పదోన్నతులు పొందారు. 2022లో ఒకరు సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. వరుసగా జరిగిన ఈ పదోన్నతుల్లో కొందరు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల్లో పూర్తి సమాచారం ఇవ్వకుండా పదోన్నతులు పొందారని, అంతే కాకుండా వీరి పదోన్నతి ఆమోదాలు కూడా పూర్తి కోరం ఉన్న పాలక మండలిలో ఆమోదం పొందలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి పదోన్నతులు యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం చెల్లవని కాకతీయ యూనివర్సిటీ మాజీ ఆంగ్ల శాఖాధిపతి ఈ. రేణుక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. లోకాయుక్త 2022 ఆగస్టు, నవంబర్ లో ఈ పదోన్నతుల ప్రక్రియపై పూర్తి పాలక మండలి ఆమోదం తీసుకోవాలని రిజిస్ట్రార్, వీసీలకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పదోన్నతులపై విచారణ జరిపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఆగస్టు నుంచి ఇప్పటివరకు చాలా సార్లు పాలకమండలి సమావేశం జరిగినా వీసీ, రిజిస్ట్రార్ లు ఈ లోకాయుక్త ఉత్తర్వులను పాలకమండలి సభ్యుల దృష్టికి తీసుకురాలేదు. లోకాయుక్త ఉత్తర్వులపై ఎటువంటి చర్చలు నిర్వహించకుండా, ఆ పదోన్నతుల ప్రక్రియపై ఎటువంటి విచారణ జరుపకుండా మళ్లీ వారికి మరొక పదోన్నతులు కల్పించారని ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని, లోకాయుక్త ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ధిక్కరణకు పాల్పడుతున్నారని రేణుక లోకాయుక్తలో ఈ నెల 4న ఫిర్యాదు చేశారు.  దీంతో వీసీ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ టి.శ్రీనివాస్, మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి , ఏ.ఆర్. అశోకబాబులపై లోకాయుక్తలో ధిక్కరణ కేసు నమోదు అయింది. 

సీనియర్ ప్రొఫెసర్ గా వీసీ ప్రమోషన్ చెల్లదు?

వీసీ రమేష్ 2010 లో ప్రొఫెసర్ గా ప్రమోషన్ పొందిన విధానమే తప్పని, అతని ప్రొఫెసర్ ప్రమోషన్ కు పూర్తి కోరం ఉన్న పాలక మండలి సభ్యుల సమావేశం ఆమోదం లేదని, ప్రొఫెసర్ గా చెల్లని వారు సీనియర్ ప్రొఫెసర్ ఎలా అవుతారని రేణుక తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల పూర్తి కోరం పాలక మండలి ఆమోదం లేదని జువాలజీ విభాగంలోని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఉద్యోగంలోంచి తీసివేసిన వీసీ, మరి తన ప్రొఫెసర్ ప్రమోషన్ కూడా పూర్తి కోరం ఉన్న పాలక మండలి ఆమోదం లేదని మరి తాను ఏ విధంగా ప్రొఫెసర్ గా కొనసాగుతారని ఫిర్యాదులో ప్రశ్నించారు. వీసీగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తనకు తానే తప్పుడు మార్గంలో సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందాడని తెలిపారు. యూజీసీ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలు ప్రొఫెసర్ గా అనుభవం లేకుండా వీసీగా కొనసాగడం పట్ల హైకోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులో వీసీ రమేష్ పై కేయూసీ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు అయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి  

మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి కూడా ప్రమోషన్ పొందడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని, ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించి ఒక జీవో ద్వారా పాత సర్వీసును కలుపుకొని 2017లో అసోసియేట్ ప్రొఫెసర్ గా, 2018లో ప్రొఫెసర్ గా ప్రమోషన్ పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూజీసీ నిబంధనల అతిక్రమించి సెలెక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక కాకుండా చేసిన సర్వీసును రెగ్యులర్ సర్వీసుగా మార్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి జీవో ద్వారా తీసుకున్న ప్రమోషన్ చెల్లుబాటు కాదని అంతే కాకుండా 2017,  2018 లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పొందిన ప్రమోషన్ కూడా పూర్తి కోరం కలిగిన పాలక మండలి ఆమోదం లేదని ఫిర్యాదులో తెలిపారు.

రిజిస్ట్రార్  టి.శ్రీనివాస్ రావు సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ అనైతికం?

ప్రస్తుత ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ టి శ్రీనివాస్ రావు క్యాంపస్ లోని ఏ విభాగంలో క్లాసులు చెప్పలేదని, అతను తీసుకున్న పే స్కేలు ప్రొఫెసర్ ప్రమోషన్ కు సరిపోదని, టి. శ్రీనివాస్ ప్రొఫెసర్ ప్రమోషన్ కూడా కొన్ని నెలలు గతంలో నిలిపివేశారని అదేవిధంగా ఈ ప్రొఫెసర్ ప్రమోషన్ కు కూడా అధికారుల ఆమోదం లేదన్నారు. అటువంటిది సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందడం యూజీసీ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ గా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తనకు తానే సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కే.యూ టీచింగ్ సెక్షన్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ బాబు కాకతీయ యూనివర్సిటీ భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని అప్పటి యూనివర్సిటీ అధికారులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేసిందని రేణుక ఆరోపించారు. అంతేకాకుండా అశోక్ బాబును ల్యాండ్ కమిటీ కన్వీనర్ పదవి నుంచి కూడా 2022లో పాలక మండలి తొలగించిందని, అటువంటి ఏఆర్ పై చర్యలు తీసుకోవాల్సింది పోయి అశోక్ బాబుతో కలిసి వీసీ కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని రేణుక ఆరోపించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget