అన్వేషించండి

Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Telangana Politics :పార్టీ మార్పు వార్తలను విజయశాంతి తోసి పుచ్చారు. అర్థం చేసుకునే వాళ్లకు చెప్పగలమన్నారు. విజయశాంతి ట్వీట్‌తో పార్టీ మారడం లేదని తెలుస్తోంది.

Vijayashanthi rejected the news of party change :  భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం  రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర  విధానం గురించి తాను అభిప్రాయం వ్యక్తం చేశానన్నారు. దానిని  అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్ట్ పై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా  కథనాలు వారే రాసి వ్యాఖ్యానిస్తూ తమ తమ సొంత కల్పన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.  అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చి ప్రయోజనం లేదని తేల్చేశారు. 

 

 

విజయశాంతి పార్టీ మారుతారని ప్రచారం జరగడానికి ఆమే చేసిన ట్వీటే కారణం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు దాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ ఎప్పటికీ ఉంటుందని ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయం చెప్పారు. క

 

 
కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనలేదు. అడపాదడపా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి తాజా వ్యాఖలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో అసలు మీరు ఏ పార్టీలో ఉంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. పార్టీ మారబోతున్నారా అంటూ నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వండి అని కామెంట్స్ చేశారు. దానికి విజయశాంతి స్పందించారు. 

కాంగ్రెస్ తీరుపై ఆమె అసంతృప్తిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  విజయశాంతి 1998 లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005 లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009 లో ఆ పార్టీని అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి, ఆమె కూడా అదే పార్టీలో చేరారు. 2009 లో మెదక్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.   తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. మళ్లీ బీజేపీ.. మళ్లీ కాంగ్రెస్ ఇలా పార్టీలు మారుతూ వస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Chandrababu Naidu at IIT Madras:  మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Chandrababu Naidu at IIT Madras:  మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Crime News: గంట సేపు శృంగారం చేసి చంపేసి పోయాడు - భరత్ నగర్ వంతెన కింద జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ
గంట సేపు శృంగారం చేసి చంపేసి పోయాడు - భరత్ నగర్ వంతెన కింద జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ
Embed widget