అన్వేషించండి

Venkaiah Naidu: 'తెలుగు సినీ కళామ తల్లికి మెగాస్టార్ మూడో కన్ను' - రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Hyderabad News: కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలకు పద్మ పురస్కారాలు ప్రకటించడం గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.

Venkaiah Naidu Comments on Megastar: కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తించి పద్మ పురస్కారాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని.. పద్మ విభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతోనే అంగీకరించానని చెప్పారు. 'పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. సీఎం రేవంత్ ను అభినందిస్తున్నా. గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారు. రాజకీయాల్లో నానాటికీ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిదీ. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు రెండు కళ్లు అయితే మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను. అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం తన నటనతో ప్రజలను మెప్పించేందుకు ఆయన నిరంతరం శ్రమించారు. ఇతరులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. అందుకు మెగాస్టార్ జీవితమే ఓ ఉదాహరణ. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే' అని ప్రశంసించారు.

వారికి బూత్ లో సమాధానం చెప్పండి

ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని.. అసెంబ్లీ, పార్లమెంటుల్లో జరిగే గలాటాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. నీతి, నిజాయితీ లేని వారికి, ప్రజలను రెచ్చగొట్టే వారికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బూతులు మాట్లాడే నేతలకు ప్రజలు పోలింగ్ బూత్ ల్లోనే సమాధానం చెప్పాలని సూచించారు. కేవలం 4 'సి'లను నమ్ముకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. అవి క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చాలిన అవసరం అందరిపైనా ఉందని అన్నారు.

'పద్మ' గ్రహీతలకు ఘన సన్మానం

కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సత్కరించారు.

'రూ.25 లక్షల నగదు, పెన్షన్'

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం. దీంతోపాటు ప్రతి నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Also Read: Chiranjeevi: నంది స్థానంలో గద్దర్ అవార్డ్స్‌, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget