By: ABP Desam | Updated at : 31 Mar 2023 12:49 PM (IST)
Edited By: jyothi
సజ్జనార్, అమితాబ్ బచ్చన్ (ఫైల్ ఫోటోలు)
VC Sajjanaar: బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ట్వీట్ చేశారు. అందులో మోసపూరిత కంపెనీలకు ప్రచారం చేయొద్దంటూ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఆమ్ వే వంటి కంపెనీలకు అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్థించారు. సెలబ్రిటీలు ఎరూ ఇలా చేయొద్దని అన్నారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్వవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో క్యూనెట్ లాంటి గొలుసు కట్టు వ్యాపారం చేసే సంస్థలకు సంబంధించిన యాడ్స్ లలో నటించవద్దని, అలాంటి అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరారు. మరోవైపు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మల్టీ లెవెన్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్ వేపై 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ... ఆమే వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది.
I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023
నెల రోజుల క్రితం సానియా మీర్జాను ట్యాగ్ చేస్తూ ట్వీట్
అయితే నెలరోజుల క్రితం కూడా సజ్జనార్ సానీయా మీర్జాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. క్యూనెట్ లాంటి సంస్థల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. గతంలో సానియా మీర్జాకు సూచించిన సజ్జనార్.. ఇప్పుడు మితాబ్ బచ్చన్ కు ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల తప్పులను కూడా నిర్మొహమాటంగా ఎత్తి చూపుతూ ఉంటారు సజ్జనార్. గతంలో తన సినిమాలో ఆర్టీసీని ప్రమోట్ చేసినందుకు టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ధన్యవాదాలు చెప్పారు, ఆర్టీసీని కించపరుస్తూ ఓ ప్రైవేట్ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ పై విమర్శలు కూడా గుప్పించారు. సోషల్ మీడియాలో సజ్జనార్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అనేక అంశాలపై ఎప్పటికప్పడు స్పందిస్తుంటారు. ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ప్రాయాణికుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తుంటారు. ఆయనకు ప్రజల్లో చాలా మంది పేరుంది.
I humbly request all celebrities to refrain from supporting/promoting QNET & all such Multi-Level Marketing companies which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. Very unfortunate that this happened in #Hyderabad today. @MirzaSania pic.twitter.com/o8T2Odb8DG
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 29, 2023
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
Ponguleti : కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన
Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు
YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !
IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !