News
News
X

తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి, ఎన్నికల రాష్ట్రాలకే వందే భారత్ రైళ్లు!

Vande Bharat Trains: తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తోంది.

FOLLOW US: 

 Vande Bharat Trains: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించింది. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని ప్రధాన మంత్రి మోదీ సర్కారు చెప్పినప్పటికీ... కేవలం నాలుగు రైళ్లను మాత్రమే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం వెంపర్లాడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు ఎలాంటి సాయాన్ని అందించకపోవడం, రైళ్ల విషయంలో మరింత నిర్లక్ష్యం వహించడం దారుణం అంటున్నారు రాష్ట్ర నేతలు. 

కేంద్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నాయకుల ఆగ్రహం..

 ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి న్యూ ఢిల్లీకి 2019 ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం తొలి వందే భారత్ రైలును ప్రారంభించింది. ఆ తర్వాత 2020లో జమ్ము కశ్మీర్ లోని కాట్రా - న్యూఢిల్లీ మధ్య, ఈ ఏడాది సెప్టెంబర్ లో మోదీ సొంత రాష్ట్రామైన గుజరాత్ లోని అహ్మదాబాద్ - ముంబై మధ్య ఈనెల 13వ తేదీన హిమాచల్ ప్రదేశ్ - న్యూ ఢిల్లీ మధ్య ఈ రైళ్లను ప్రవేశ పెట్టింది. వచ్చే నెల 10వ తేదీన చెన్నై - బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ, తెలంగాణలో రైల్వేలో అత్యధిక లాభాలు వస్తున్నప్పటికీ వందేభారత్ రైలు ప్రారంభించేందుకు చేతులు రావడం లేదని కేంద్రంపై రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఎన్నికలు ఉన్న చోట మాత్రమే రైళ్లను ప్రారంభించడం దారుణం అని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని.. తెలంగాణలో కూడా వందేభారత్ రైలును ప్రారంభించాలని పేర్కొన్నారు.  

News Reels

ట్రాకుల సామర్థ్యం, సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్టంగా లేదు..

తెలంగాణలో వందేభారత్ రైళ్లను ప్రారంభించాలన్న ప్రతిపాదనలు చాలా కాలం నుంచే ఉన్నప్పటికీ అందుకు రాష్ట్రంలోని రైల్వే ట్రాకుల సామర్థ్యం సరిపోదని, సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్టంగా లేదని సాకులు చెప్తూ కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తెలంగామలో వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రారంభిస్తే ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సమాచారం మాత్రం దక్షిణ మధ్య రైల్వే అధికారుల వద్ద లేదు. ఈ రైళ్ల వేగానికి అనుగుణంగా ట్రాకుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని తమకు ఆదేశాలు కూడా రాలేదని వారు చెబుతున్నారు. 

వందే భారత్ రైళ్లలో సకల సౌకర్యాలు..

గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లను దేశీయ పరిజ్ఞానంతో ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. అన్నీ ఏసీ కోట్ లు మాత్రమే ఉండే ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక వసతులు కల్పిస్తున్నారు. నాణ్యమైన క్యాటరింగ్, ప్రయాణికులకు ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బయో టాయిలెట్లు, స్పోక్ అలారం, ఆటోమేటిక్ డోర్ లాకింగ్, పెద్ద కిటికీలు, రొటేటింగ్ వీల్ చైర్లు, బ్యాగేజీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  కానీ ఈ మధ్య పశువులను ఢీకొనడంతో వందే భారత్ రైళ్ల డొల్ల తనం తేలిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వరుస రోజుల్లో వందే భారత్ రైళ్లు ఇలాంటి ప్రమాదాలకు గురయ్యాయి. డ్యామేజీ జరిగిన కొన్ని గంటలకే కొత్త బాడీని అరెంజ్ చేసి వీటిని అంతరాయం లేకుండా రన్ చేస్తోంది కేంద్ర రైల్వే శాఖ.

Published at : 16 Oct 2022 08:39 AM (IST) Tags: Telangana News Vande Bharat Trains Vande Bharath Express Trains News Train 18 News

సంబంధిత కథనాలు

Delhi Liquor Scam Kavita Name :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి కవిత పేరు - అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఈడీ !

Delhi Liquor Scam Kavita Name : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి కవిత పేరు - అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఈడీ !

Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

ACB Raids: ఇంటి పర్మిషన్ కోసం లంచం, ఏసీబీకి అడ్డంగా దొరికిన పంచాయతీ కార్యదర్శి

ACB Raids: ఇంటి పర్మిషన్ కోసం లంచం, ఏసీబీకి అడ్డంగా దొరికిన పంచాయతీ కార్యదర్శి

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ  -  ఎందుకు ? ఏమిటి ? ఎలా?

టాప్ స్టోరీస్

Kavita Vs Sharmila : రాజకీయాల్లో తిట్లతోనే కాదు కవితలతోనూ విమర్శించుకోవచ్చు - ఇదిగో షర్మిల, కవితల సాహిత్య సంవాదం !

Kavita Vs Sharmila  :  రాజకీయాల్లో తిట్లతోనే కాదు కవితలతోనూ విమర్శించుకోవచ్చు  - ఇదిగో  షర్మిల, కవితల సాహిత్య సంవాదం !

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్