Adilabad News: ఉట్నూరు ఐటీడీఏ రోజువారీ కూలీల వెతలు - సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ITDA daily wage workers : ఉట్నూరు ఐటీడీఏ రోజువారీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత తో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Adilabad Utnur ITDA daily wage workers dharna : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు గత కొద్దిరోజులుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేసే డైలీ వేజ్ వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. వారంతా ఇప్పుడు నిరవధిక సమ్మె చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేసే రోజువారీ కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్స్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ ేచస్తున్నారు. నిరవధిక సమ్మె చేపట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు.
డైలీ వేజ్, కాంట్రాక్ కార్మికుల నిరవధిక సమ్మె
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్, కాంట్రాక్ట్ వర్కర్స్ సిబ్బంది తాము గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నప్పటికీనీ చాలి చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కూడా లేదంటూ నాలుగు నెలలకోసారి ఇచ్చే వేతనాలు కూడా సరిపోవడం లేదంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 64 జీవోను విడుదల చేసిందని, ఆ జీవోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దినసరి ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, ఐటీడీఏ డైలీ వైస్ వర్కర్స్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొడప మధునమ్మ, ఐటిడిఏ డైలీ వైస్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, మరియు ఆదిలాబాద్ CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ లు ఏబీపీ దేంతో తమ ఆవేదన వెలిబుచ్చారు.
ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమని గుర్తించాలని డిమాండ్
గత 43 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమ్మె కోనసాగుతోందని, ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు 3 రోజులుగా 72గంటల నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని, ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమని గుర్తించాలని తమ విద్యార్థులకు సేవలు అందించే విధంగా తమకు ఉద్యోగ భద్రత తో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటిడిఎ కార్యాలయం ముందు రాత్రి పగలు ఇక్కడే ఉంటూ రాత్రుల్లోనూ ధర్నా నిర్వహించడం జరిగిందని, అయినా ఏమాత్రం తనని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం !
ప్రభుత్వమే తమను పట్టించుకోవాలని.. ఆదుకోకపోతే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం పెంచి తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం అదే విధంగా మంత్రుల ఇళ్లు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.





















