Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ
Polavaram Flood: పోలవరం ముంపులో తుది నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం కావాలని కోరుతూ... సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
![Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ Union Government Letter to Supreme Court on Polavaram Flood Caused Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/7f6ae3301c56f68265e06b1b462c1b0d1679900539865519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Polavaram Flood: పోలవరం ముంపుపై దాఖలైన పిటిషనర్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. మూడు నెలల పాటు విచారణను వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఒడిశా, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకు రాబోతున్న తరుణంలో కేంద్రం ఈ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కసరత్తు జరుగుతోందని, తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం అవరసం అని పేర్కొంది.
ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంయుక్త సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, భాగస్వాములతో సమావేశం నిర్వహించాలని, అవసరం అయితే ప్రభావిత రాష్ట్రాలు సీఎంలు కూర్చొని మిగిలిపోయిన సమస్యలు పరిష్కరించుకోవాలని గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తుది నివేదిక అందించడానికి మూడు నెలల సమయం కావాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం లేఖ సమర్పించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)