News
News
వీడియోలు ఆటలు
X

TSPSC Leak Case : లవర్ కోసం క్వశ్చన్ పేపర్ కొనుగోలు - ఇద్దరూ కలిసి జైల్లోకి ! టీఎస్‌పీఎస్సీ కేసులో మరో రెండు అరెస్టులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రూ. 6 లక్షలకు డీఏవో పేపర్ కొన్నారు.

FOLLOW US: 
Share:

TSPSC Leak Case :  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్ లీకేజీ కేసులో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు  డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పేపర్‌ ను ప్రధాన నిందితుడయిన శ్రావణ్ వద్ద కొనుగోలు చేశారు. అరెస్టయిన వారిని సాయి లౌకిక్, సుష్మగా గుర్తించారు. వీరిద్దరూ ప్రేమికులు. సుష్మ కోసం సాయి లౌకిక్ ఆరు లక్షల రూపాయలు శ్రావణ్‌కు చెల్లించి మరీ ప్రశ్నాపత్నాన్ని కొనుగోలు చేశారు. శ్రావణ్‌కు బ్యాంక్ ఖాతా ద్వారా నగదు చెల్లించారు. సిట్ పరిశోధనలో శ్రావణ్  బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో ఇలా పెద్ద మొత్తంలో నగదు జమ అయిన విషయాన్ని గుర్తించారు. ఎవరు జమ చేశారో ఆరా తీసి వారిని ప్రశ్నించడంతో అసలు గుట్టు బయట పడింది. పేపర్ కొనుగోలు చేసినందున వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇప్పటి వరకూ  TSPSC పేపర్‌ లీక్‌ కేసులో  అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది. 

 టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై టెక్నికల్ సాక్ష్యాల కోసం సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఎస్‌ఎల్ విశ్లేషణ చేయించారు. ఆ నివేదిక కూడా పోలీసులకు అందింది.  ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌ తో విశ్లేషణ చేయించారు.  టీఎస్‌పీఎస్సీ ఆఫీసులోని ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ నివేదిక రావడంతో 90 శాతం విచారణను సిట్ పూర్తి చేసినట్లయింది.  ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును కోర్టుకు సిట్ అందించనుంది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. 150 మందికిపైగా వ్యక్తులను సిట్ ఇప్పటివరకు విచారించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్, సెక్రెటరీ, మెంబర్, 15 మంది నిందితులు, గ్రూప్-1 అభ్యర్థులను సిట్ విచారించింది. ఈ నెల 11న హై కోర్టుకు సిట్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించనుంది.
 
ఒకరి ద్వారా మరొకరికి పేపర్ చేరింది. ప్రవీణ్, రాజశేఖర్ నుంచి రూ.15 లక్షలకు పేపర్ తీసుకున్న నిందితులు.. మరికొంతమందికి విక్రయించారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడటంతో.. ఇలా ఎప్పటినుంచి పేపర్లు లీక్ అవుతున్నాయనే అంశం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఇలా ఇంకా ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనేది ఆందోళనకరంగా మారింది. అనేక ప్రశ్నాపత్రాలను నిందితులు లీక్ చేసినట్లు గుర్తించారు.  మరోవైపు పేపర్ లీక్ కేసుపై ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నిందితుల మధ్య లావాదేవీల విషయంపై ఆరా తీస్తోంది.నగదు లావాదేవీలు హవాలా మార్గం ద్వారా జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో నిందితుల మధ్య లావాదేవీలు ఎలా జరిగాయనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

పేపర్ లీక్ కేసును త్వరగా చేధించి.. వెంటనే కొత్త పరీక్షల తేదీలను ప్రకటించాలని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎవరో కొంత మంది చేసిన తప్పునకు లక్షల మంది విద్యార్థులు మానసిక వేదన అనుభవించాల్సి వస్తోందని అంటున్నారు.                        

Published at : 07 Apr 2023 07:02 PM (IST) Tags: Telangana News TSPSC Paper leak case arrests in paper leak case

సంబంధిత కథనాలు

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా