అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TSRTC Dasara buses: దసరా పండుగకు 5వేల ప్రత్యేక బస్సులు-అదనపు ఛార్జీలు లేకుండానే

దసరాకు ఊరు వెళ్దామనుకుంటున్నా..? ట్రైన్‌ టికెట్‌ దొరకలేదా? నో ప్రాబ్లెమ్‌... మీ కోసమే బస్సులు నడుపుతోంది TSRTC. 5వేలకుపైగా సర్వీసులును సిద్ధం చేసింది.

దసరా వచ్చిందంటే ఆ సందడే వేరు. తెలుగు రాష్ట్రాల్లో దసరా, బతుకమ్మ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌తోపాటు మిగిలిన నగరాల్లో స్థిరపడ్డవాళ్లు కూడా  బతుకమ్మ పండుగ కోసం తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకుంటారు. అయితే.. పండుగ సమయంలో ప్రయాణం కాస్త కష్టమే. ట్రైన్లు, బస్సుల టికెట్లు ఎప్పుడో బుక్‌  అయిపోతాయి. ప్రైవేట్‌ బస్సులను నమ్ముకుందామంటే జేబులు గుల్ల చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలి..? ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సిద్ధమైంది టీఎస్‌ఆర్‌టీసీ.  దసరా పండుగ ప్రయాణాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వేల సంఖ్యలో బస్సులను రెడీ చేసింది. చీకూచింత లేకుండా.. దసరా పండుగకు సంతోషంగా ఊరు  వెళ్లిరమ్మంటోంది టీఎస్‌ఆర్‌టీసీ.

దసరా పండుగ కోసం సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం 5వేల 265 బస్సులను నడపబోతోంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ-TSRTC. అందు కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తోంది.  ఈనెల 13 నుంచి 25 వరకు అంటే... దాదాపు 12 రోజుల పాటు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 5వేల 265 బస్సుల్లో 536 బస్సులకు ముందస్తు  రిజర్వేషన్లు కూడా అవకాశం కూడా కల్పిస్తోంది TSRTC. ముందే టికెట్లు రిజర్వ్‌ చేసుకోవాలనుకునే... చేసేసుకోవచ్చు. గత ఏడాది దసరాకు 4వేల 280 ప్రత్యేక బస్సులను  నడిపిన టీఎస్‌ఆర్‌టీసీ... ఈ ఏడాది వెయ్యి బస్సులు అదనంగా నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో.. గత ఏడాది కంటే ఈసారి ప్రత్యేక  బస్సుల సంఖ్యను పెంచింది. 

దసరా పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న ఈ బస్సులు అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని.. ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ  అజయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టికెట్ల ధరలు ఎప్పట్లాగే ఉంటాయని... ఛార్జీల పెంపు లేదని ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో 536 బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌  కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్‌ బస్సులతో పోలిస్తే...ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సేఫ్‌. క్షేమంగా ఊరెళ్లి పండుగ చేసుకుని... ఆ సంతోషాలతో తిరిగివచ్చేందుకు  టీఎస్‌ఆర్‌టీసీ ఈ చక్కటి అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది TSRTC.

ఈనెల 24న దసరా పండుగ కాగా... 22 సద్దుల బతుకమ్మ, 23న మహర్ణవమి. దసరా నవరాత్రుల్లో ఇవి ముఖ్యమైన పండుగలు. ఆ రోజుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే  అవకాశం కనుక. కనుక.. అవసరాన్ని బట్టి... ప్రత్యేక బస్సులను పెంచాలని కూడా ఆలోచిస్తోంది TSRTC. తెలంగాణతోపాటు పక్కరాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,  మహారాష్ట్రకు కూడా దసరా ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపింది. అంతేకాదు... హైదరాబాద్‌లోని MGBS, జేబీఎస్‌, సీబీఎస్‌ బస్టాండ్లతోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా  ఉండే KPHB కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.  పండుగ రోజుల్లో MGBS-ఉప్పల్, MGBS-JBS, MGBS-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటు ఉంటుందని కూడా ప్రకటించింది టీఎస్‌ఆర్టీసీ. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget