అన్వేషించండి

TSRTC: ఈనెల 13 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు-బతుకమ్మ, దసరాకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

దసరా వచ్చేస్తోంది. బతుకమ్మ సంబరాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. టీఎస్‌ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను రెడీ చేసేసింది. ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు రోడ్డెక్కబోతున్నాయి.

దసరా వచ్చిందంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ పండుగలకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో  జరుపుకోవాలని అందరూ భావిస్తారు. హైదరాబాద్‌తోపాటు మిగిలిన నగరాల్లో స్థిరపడ్డవాళ్లు కూడా బతుకమ్మ పండుగ కోసం తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకుంటారు.  పండుగల వేళ రద్దీ ఎక్కువ కావడం వల్ల ఉన్న బస్సులు, ట్రైన్లు సరిపోవు. అందుకే టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగల కోసం సంతోషంగా స్వగ్రామాలకు  వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 13 నుంచి 24 వరకు  5,265 స్పెషల్‌ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. 

హైదరాబాద్‌ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అధ్యక్షతన పోలీస్‌, రవాణాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు  చేర్చడంలో... ఆర్టీసీ ఉద్యోగులతోపాటు పోలీస్‌, రవాణాశాఖల సహకారం కూడా ఎంతో ఉందన్నారు సజ్జనార్‌. పండుగల వేళ ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పోలీసు, రవాణాశాఖ  సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఈసారి కూడా ఆ శాఖలు సహకారం అవసరమని చెప్పారు సజ్జనార్. ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 స్పెషల్‌ బస్సులు సిద్ధం చేసినా... 
ఈనెల 20 నుంచి 23 వరకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని... దీంతో ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని  చెప్పారు. 

గత ఏడాది దసరాకు 4వేల 280 ప్రత్యేక బస్సులను నడిపింది టీఎస్‌ఆర్‌టీసీ. ఈ ఏడాది మాత్రం మరో వెయ్యి బస్సులు అదనంగా నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో.. గత ఏడాది కంటే ఈసారి ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచింది. టీఎస్‌ఆర్టీసీ సిద్ధం చేసిన 5,265 స్పెషల్‌ బస్సుల్లో... 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని ఇదివరకే ప్రకటించారు. ఈనెల 24న దసరా పండుగ కాగా... 22 సద్దుల బతుకమ్మ, 23న మహర్ణవమి. దసరా నవరాత్రుల్లో ఇవి ముఖ్యమైన పండుగలు. ఆ రోజుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే  అవకాశం ఉంది. కనుక.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి... ప్రత్యేక బస్సులు పెంచుతామని చెప్పారు సజ్జనారు. 

తెలంగాణతోపాటు పక్కరాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రకు కూడా దసరా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. అంతేకాదు... హైదరాబాద్‌లోని MGBS, జేబీఎస్‌, సీబీఎస్‌ బస్టాండ్లతోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే KPHB కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.  పండుగ రోజుల్లో MGBS-ఉప్పల్, MGBS-JBS, MGBS-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటు ఉంచబోతున్నారు. 

ప్రయాణికులు తమ సమయం వృథా కాకుండా... గమ్యం ట్రాకింగ్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు సజ్జన్నార్‌. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి  సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని కోరారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ  అధికారులను నియమిస్తున్నట్టు చెప్పారు సజ్జనార్‌. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని... ప్రయాణికులకు ఆ సమాచారం  అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా నియమిస్తున్నామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget