News
News
X

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఆగస్టు15 ఆఫర్లు: వీళ్లకి 12 ఏళ్ల ఫ్రీ ప్రయాణం, వీరికి ఆ రోజంతా - ఇంకా ఎన్నో బంపర్ ఆఫర్స్

TSRTC Offers: వచ్చే ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణించే ఆఫర్ ను కల్పించనున్నారు.

FOLLOW US: 

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day 2022), అజాదీ కా అమృతోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav) సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్లను కొన్నింటిని 12 రోజుల పాటు ప్రయాణికులకు అందించేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఆగస్టు 15 నాటికి ఎవరైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెద్ద వారు ఉంటారో వారందరు ఆ రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. అంతేకాకుండా, టీ-24 బస్‌ టికెట్ ను ఆ రోజున రూ.75 రూపాయలకే అమ్మనున్నారు. మామూలు రోజుల్లో అయితే, ఈ రకం టికెట్ ధర రూ.120 ఉంటుంది. ఆగస్టు 15 సందర్భంగా తాము నిర్ణయించిన ఆఫర్లను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ (Bajireddy Govardhan), మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) సోమవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు తెలంగాణ ఆర్టీసీ తరపున వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. 

ఆ రోజు జన్మిస్తే 12 ఏళ్లు ఫ్రీగా..
ఈ వేడుకల్లో భాగంగా ముఖ్యమైన ఆఫర్‌ను కూడా ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ (Bajireddy Govardhan), మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌ సోమవారం ప్రకటించారు. అందులో భాగంగా వచ్చే ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణించే ఆఫర్ ను కల్పించాలని నిర్ణయించినట్లుగా వారు తెలిపారు.

ఇక నేటి నుంచి అంటే ఆగస్టు 9 నుంచి తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని (National Anthem) ఆలపించనున్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ జెండాను (National Flag of India) ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్దేశించింది.

అంతేకాకుండా, ఈ ఆగస్టు 15, అజాదీ కా అమృతోత్సవ్‌ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ (TSRTC) మరికొన్ని కానుకలను ప్రయాణికులకు అందించింది. అవేంటంటే

* టీటీడీ (TTD) ప్యాకేజీని ఉపయోగించుకొని ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 టికెట్ లో తగ్గించనున్నారు.

* టీఎస్ ఆర్టీసీ (TSRTC) కార్గో సేవల్లో భాగంగా ఒక కిలో బరువు లోపు ఉన్న పార్సిళ్లను 75 కిలోమీటర్ల వరకు ఉచితంగా చేరవేసే సౌకర్యం కల్పించారు. అయితే, ఈ వెసులుబాటు ఆగస్టు 15న మాత్రమే కల్పించారు.

* టాప్‌-75 ప్రయాణికులకు ఒక ట్రిప్‌ టికెటు ఉచితంగా ఇవ్వనున్నారు.

* ఇక ఎయిర్‌ పోర్టుకు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి (Shamshabad Airport) వెళ్లాలంటే పుష్పక్‌ ఎయిర్‌ పోర్ట్‌ లైనర్ సర్వీసును (Pushpak Airport Liner) వాడుకుంటే అందులో కేవలం 75 శాతం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ టికెట్ ధరలో ఆ ఒక్క రోజు 25 శాతం రాయితీ కల్పించారు.

* 75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఫ్రీగా మెడికల్ టెస్టులు చేసే వెసులుబాటు కల్పించారు. 75 ఏళ్లలోపు వారికి రూ.750 రూపాయలకు మెడికల్ టెస్టుల ప్యాకేజీని పెట్టారు.

ఈ సదుపాయాలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ (Bajireddy Govardhan), మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) పిలుపు ఇచ్చారు.

Published at : 09 Aug 2022 08:46 AM (IST) Tags: VC Sajjanar August 15 Azadi ka Amrit Mahotsav Bajireddy Govardhan TSRTC News TSRTC Offers

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News Live Telugu Updates: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ -  మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

వైరల్‌ అవుతున్న కోహ్లీ నిర్ణయం- అందుకే కింగ్ అయ్యాడంటున్న ఫ్యాన్స్‌

వైరల్‌ అవుతున్న కోహ్లీ నిర్ణయం- అందుకే కింగ్ అయ్యాడంటున్న ఫ్యాన్స్‌

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్