TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - మరో ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ
Telangana News: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. ఎక్స్ ప్రెస్ MST పాస్ తీసుకున్న ప్రయాణికులు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.
TSRTC Offer To Passengers: టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ (MST) పాస్ తీసుకునే వారికి శుభవార్త అందించింది. ఈ పాస్ కలిగిన వారు ఇక డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. MST పాస్ ఉన్న ప్రయాణికులు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే, ఎక్ర్ ప్రెస్ పాస్ ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. కాంబినేషన్ టికెట్ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Vc Sajjanar) సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు టీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో పొందవచ్చు.
ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ దారులకు శుభవార్త! ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును #TSRTC కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ పాస్ దారులకు మాత్రమే ఈ సదుపాయం… pic.twitter.com/Lm8rbOLl52
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 6, 2024
ఆ ఛార్జీలు రద్దు
కాగా, ఇటీవలే వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు 8 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tsrtconline.in వెబ్ సైట్ సదర్శించాలని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ కోసం ఇప్పటికే 10 శాతం రాయితీని సంస్థ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ముందుగా బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపు ఆఫర్ ఇచ్చారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను #TSRTC మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A వెబ్ సైట్ ని సంప్రదించండి.@TSRTCHQ… pic.twitter.com/RVJLegoj5A
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 3, 2024
Also Read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్ - బెయిల్ నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు