MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్ - బెయిల్ నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.
Rouse Avenue Court Rejected Bail To Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసుల్లో వేర్వేరుగా కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. న్యాయస్థానం మే 2న తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందన్నారు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరగ్గా.. తీర్పును మే 2 (గురువారం)కు రిజర్వ్ చేసింది. ఆ రోజు విచారణ సందర్భంగా మే 6వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
Rouse Avenue Court of Delhi refuses to grant bail to BRS) leader K Kavitha in connection with ED and CBI cases related to the Delhi Excise Policy case.
— ANI (@ANI) May 6, 2024
(File photo) pic.twitter.com/zDsesF6k1j
ఇరువర్గాల వాదనలు
ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్లపై ఆమె తరఫు లాయర్లతో పాటు ఈడీ, సీబీఐ తరఫున లాయర్లు సైతం వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని.. ఈడీ కస్టడీలో ఉండగానే సీబీఐ ఆమెను అరెస్ట్ చేసిందని కోర్టుకు ఆమె తరఫున న్యాయవాది సింఘ్వి వాదించారు. బీఆర్ఎస్ కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 'మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలు. ఆమె అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి సాక్ష్యం లేదు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారు' అంటూ కోర్టుకు తెలిపారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని.. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తమ రాజకీయ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ అని.. ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారని వాదించారు. ఆమె పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని గుర్తు చేశారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఉన్న కేసులో అరెస్ట్ అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే, దీనిపై ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఈ కేసులో ఆమె కీలక సూత్రధారి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Also Read: Asifabad News: నీట్ యూజీ పరీక్షలో గందరగోళం - సెలెక్ట్ చేసిన పేపర్ బదులు వేరే పేపర్, ఆసిఫాబాద్ లో ఘటన