అన్వేషించండి

TSRTC News: తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ - ఎలాంటి బస్సులో అయినా నగదు రహిత ప్రయాణం!

TSRTC News: తెలంగాణ ఆర్టీసీలోని అన్ని రకాల బస్సుల్లో నగదు రహిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. డిజిటల్ చెల్లింపులు చేసే వెసులుబాటును ఇస్తోంది.  

TSRTC News: తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. బస్సుల్లో నగదు రహిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులు అన్నింట్లో ఐ-టిమ్స్ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చని చెబుతోంది. ఈమేరకు బండ్లగూడ బస్ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్ ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల అనేక సమస్యలు వస్తుంటాయి. చిల్లర ఇవ్వమని కండక్టర్, లేవని ప్రయాణికులు గొడవలు పడిన సంఘటనలు కోకొల్లలు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి యాజమాన్య బట్ టికెట్లను రౌండ్ ఫిగర్లుగా మార్చింది. రూ.10, 15, 20, 25.. ఇలా రౌండ్ ఫిగర్ చేసేసింది. అయినప్పటికీ సమస్యలకు చెక్ పడలేదు. దీంతో దూర ప్రాంత, అధిక ఛార్జీలు ఉండే 700 బస్సుల్లో (సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో) ఐ-టిమ్స్ ను ప్రవేశ పెట్టారు. మిగిలిన 8 వేల 300 బస్సుల్లో సాధారణ టిమ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిల్లో కూడా నగదు రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఇటు ఉద్యోగులతో పాటు ప్రయాణికుల సమస్యలను తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇటీవలే ప్రయాణికులకు ఫ్రీ వైఫై కల్పిస్తూ..

తెలంగాణలో ఆర్టీసీబసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 

వచ్చే నెల నుంచి హైదరాబాద్ రోడ్లపై విద్యుత్ బస్సులు

గ్రేటర్ జోన్ పరిధిలో వచ్చే నెల నుంచి విద్యుత్ బస్సులను నడిపాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులను నగరంలో ఏయే మార్గాల్లో నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు ఆన్ లైన్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా ఏ మార్గంలో విద్యుత్ బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, పాత మార్గాల్లోనే వీటిని నడపాలా లేదా కొత్త మార్గాలను ఎంపిక చేయాలా అని ఆలోచిస్తుంది. అంతేకాకుండా మెట్రో రైళ్లు ఉన్న మార్గాల్లో నడిపితే లాభం ఉంటుందా అనే దానిపై ప్రజల స్పందన కోరుతున్నారు. ఇందుకోసమే ఆన్ లైన్ లో సర్వే నిర్వహించి.. ఆపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరు నుంచి ఏడాదిలోగా దాదాపు వెయ్యికి పైగా విద్యుత్ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇందుకోసం ఇప్పటికే ఒలెక్ట్రా కంపెనీతో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలో నడిపించే విద్యుత్ బస్సులు నాన్ ఏసీగా ఉంటాయి. అందుకు సంబంధించిన నమూనా బస్సును ఇప్పటికే ఒలెక్ట్రా విడుదల చేసింది. అన్ని సక్రమంగా ఉంటే నగరంలో తొలి విడతగా 28 బస్సులను తీసుకురానున్నారు. నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర ప్రజలకు ప్రాణవాయువు పెంచాలన్న లక్ష్యంతోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకు వస్తోంది. అయితే ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ కు పంపించి.. వాటి స్థానంలో విద్యుత్ బస్సులను ఏర్పాటు చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget