By: ABP Desam | Updated at : 30 May 2023 06:57 PM (IST)
పేపర్ లీక్ పై టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం
TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన సిట్ అరెస్ట్ చేసిన 37 మందిని డీబార్ చేస్తూ టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో వారు టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు రాసేందుకు అర్హులు కాదు. మరోవైపు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 50కి చేరువలో ఈ సంఖ్య 100 దాటుతుందని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. బ్లూ టూత్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి కొందరు ఏఈఈ ఎగ్జామ్ రాసినట్లు సోమవారం విచారణలో తేలింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలైన కొన్ని రోజులకు ఆ ఫలితాలను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు, ఏఈ, ఏఈఈ, డీఏఓ ఎగ్జామ్ పేపర్లు లీకైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. కొన్ని పరీక్షలను నిర్వహణకు ముందే వాయిదా వేసి, కొత్త ఎగ్జామ్ తేదీలను కమిషన్ ప్రకటించింది. ఈ క్రమంలో పేపర్ లీకేజీ కేసులో సిట్ అరెస్ట్ చేసిన వారిలో ప్రస్తుతానికైతే 37 మందిని డీబార్ చేసింది టీఎస్ పీఎస్సీ. ఈ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని వారికి సూచించింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో పారదర్శకత ఉండాలని, మోసాలు, అవినీతికి తావుండకూడదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రస్తుతం లీవ్ లో ఉండగా సీవీ ఆనంద్ ఆ కేసును తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు.
ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
టీఎస్ పీఎస్సీ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించి షాకయ్యారు. ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ అయ్యారు. ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ ను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక దర్యాప్తు టీమ్ (SIT) టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు దాంతో TSPSC Paper Leak కేసులో మెుత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరుకుంది. నిన్న అరెస్టయిన వారిలో సైతం ఏఈఈ పేపర్ కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ఆదివారం రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు రవికిషోర్ నుంచి ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పేపర్లను కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే రమేష్ సైతం మరో 20 మందికి ఏఈఈ పేపర్ విక్రయించినట్లు చెప్పాడు. కోచింగ్ సెంటర్లో పరిచయమైన వారికి పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు వివరాలు సేకరించారు. రమేష్ ఇచ్చిన సమాచారంతో సోమవారం నాడు ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!
Putta Madhu Padayatra: పాదయాత్రలో కంటతడి పెట్టిన పుట్ట మధు, బతికుండగానే చంపేస్తున్నారంటూ ఆవేదన
సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల
MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్
MLC Kavitha: దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా? బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా? - గవర్నర్ తీరుపై కవిత ఫైర్
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>