News
News
X

TRS Plenary: నేడే టీఆర్ఎస్ ప్లీనరీ, 20 ఏళ్ల పార్టీ.. 60 ఏళ్ల కలను నెరవేర్చింది..! ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేర్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహిస్తున్నారు.

FOLLOW US: 
 
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం (అక్టోబర్ 25న) జరగనున్న పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 15న వరంగల్ లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు తమ పార్టీ ఘనతపై టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వరంగల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ విజయవంతంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వచ్చిందన్నారు.

గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల కలను నెరవేరుస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ప్లేస్ అయిన వరంగల్‌లో విజయ గర్జన పేరుతో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 600 ఎకరాల్లో భారీ బహిరంగ సభ కార్యక్రమాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ‘తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ పాలనతో వారి ఆశలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చుతుంది. పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్బంగా భారీ సభను ఏర్పాటుచేస్తున్నాం.

Also Read: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. దేశంలో ఏ పార్టీ సైతం ఇంత తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఆ గౌరవం దక్కింది. రైతులకు సకాలంలో రుణమాఫీ జరుగుతుంది. ఎరువులు, మద్దతు ధర లాంటి సదుపాయాలు కలిస్తున్నాము. రాబోయే 100 ఏళ్ల వరకు తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం ఇటీవల పూర్తయింది. త్వరలోనే ప్రారంభిస్తామని’ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వివరించారు.

News Reels

Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

టీఆర్ఎస్ ప్రభుత్వం  అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. కానీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. ప్రజా క్షేత్రంలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆదరణ లభిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. 

Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Oct 2021 04:40 PM (IST) Tags: telangana trs kcr warangal Warangal Vijaya Gharjana TRS Plenary TRS Plenary on Oct 25 Vinay Bhaskar

సంబంధిత కథనాలు

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

Breaking News Live Telugu Updates: తెలంగాణపై సమైక్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు -గుత్తా సంచలనం

Breaking News Live Telugu Updates: తెలంగాణపై సమైక్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు -గుత్తా సంచలనం

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?