Telangana Govt: నేడే ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా.. నిరసనలో సీఎం కేసీఆర్ కూడా.. ఆ తర్వాత..
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం రోజున ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనుంది.
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం రోజను ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేయనుంది. ఈ మేరకు ధర్నా ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. రైతుల కోసమే టీఆర్ఎస్ మహాధర్నా తలపెట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు నవంబర్ 18న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా.#AntiFarmerBJP pic.twitter.com/iK6StKKT7i
— TRS Party (@trspartyonline) November 17, 2021
కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనకుండా రైతులను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తోందని.. ఇలా చేస్తే.. సహించేది లేదని.. కేంద్రంతో కొట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా.. రైతులకు పక్షాన నిరసన తెలుపుతామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మహాధర్నా నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని హరీశ్ రావు అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కూడా కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని విమర్శించారు. యాసంగిలో దాన్యం కొనే అంశాన్ని కేంద్రం పునసమీక్షించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కూర్చోబోతున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నామని తెలిపారు.
ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవారి మెడలు వంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారని.. బీజేపీ మెడలు వంచి రైతుల ప్రయోజనాలు కాపాడుతారన్నారు. బండి సంజయ్ రోడ్లమీద తిరుగుతూ పిచ్చిగా మాట్లాడే దిక్కుమాలిన కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని సూచించారు. తిరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి రైతులకు స్పష్టమైన హామీ ఇప్పించుని మంత్రి సత్యవతి సూచించారు. యాసంగి పంట కొంటారా? లేదా చెప్పాలి? అని మంత్రి ప్రశ్నించారు.
Also Read: మానేరులో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ.. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం
Aslo Read: CM KCR: ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలివ్వమని చెప్పండి.. ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ..