Breaking News Live: తిరుమలలో రోడ్డు ప్రమాదం - భక్తులపైకి దూసుకెళ్లిన కారు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణాది రాష్ట్రాల్లో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అలర్ట్ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దాంతో ఏపీ, యానాంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కర్ణాటకలో, తమిళనాడులోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం నేడు మరింత చల్లగా మారనుంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులు, చలిగాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దిగొచ్చాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తేలికపాటి జల్లులతో రాయలసీమ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. 40 దాటిన ఉష్ణోగ్రతలు గత రెండు రోజులుగా దిగొస్తున్నాయి. అత్యధికంగా అనంతపురంలో 38.9 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 36 డిగ్రీలు, కర్నూలులో 38.6 డిగ్రీలు నమోదైనట్లు అమరావతి కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రతో పోల్చితే ఇక్కడ ఉష్ణోగ్రతలు కనీసం 3, 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Telangana Temperature Today)
బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాలపై ఉంది. అయితే ఏపీలో లాగ ఉష్ణోగ్రతలు దిగిరాలేదు. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఊరట లభించింది. ఇటీవల ఇక్కడ 40 డిగ్రీలు టచ్ అయిన ఉష్ణోగ్రతలు తాజాగా 37.2 డిగ్రీలుగా నమోదైంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా 40.1 డిగ్రీలు, ఆ తరువాత ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, నల్గొండలో 39.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Tirumala News: తిరుమలలో భక్తులపైకి దూసుకెళ్లిన కారు
తిరుమలలో భక్తులపైకి కారు దూసుకెళ్లింది.. శ్రీవారి ఆలయంకు సమీపంలోని రాంభగీచ్చా బస్టాండు వద్ద భక్తులు రోడ్డుపై నిలుచుని ఉండగా ఒక్కరిగా భక్తులపై కర్ణాటకకు చేందిన కారు భక్తులను ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ముంబైకి చెందిన ఇసైయమ్మళ్ కు రెండు కాళ్ళు విరగగా, తెలంగాణకు చేందిన వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని 108 ద్వారా ఆశ్వినీ ఆసుపత్రికి తరలించారు.. ఘటన స్ధలానికి చేరుకున్న తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Ap Cabinet: మంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన విడదల రజనీ
చిలకలూరిపేట నుంచి ఎన్నికైన విడదల రజనీ తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో ప్రత్తిపాటి పుల్లారావు ఓడించి వైసీపీ తరఫున గెలుపొందారు. తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సీఎం జగన్ కాళ్లకు నమస్కరించారు.
Ap Cabinet: రెండోసారి ప్రమాణం చేసిన తానేటి వనిత
కొవ్వూరు నుంచి విజయం సాధించిన తానేటి వనిత రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2019 నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 2009లో తొలిసారిగా గోపాలపురం నుంచి ఎన్నికయ్యారు. 2019లో కొవ్వూరు నుంచి వైసీపీ తరఫున గెలుపొందారు.
Ap Cabinet: రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసిన అప్పలరాజు
పలాస నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికన సీదిరి అప్పలరాజు రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. వైద్యుడిగా పలాసలో సేవలు అందించడంతో ఫేమస్ అయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన జగన్ కాళ్లకు నమస్కరించారు.
Ap Cabinet: చేతికి ముద్దు- కాళ్లకు దండం- మంత్రిగా ప్రమాణ స్వీకారంలో రోజా స్టైలే వేరు
నగరి నుంచి వరుసుగా రెండుసార్లు విజయం సాధించిన రోజా తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేశారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 19లో వైసీపీ తరఫున నగరి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉన్నారు. అనంతరం జగన్ కాళ్లకు నమస్కరించారు. చేతికి ముద్దు పెట్టారు.