అన్వేషించండి

జాతీయ పార్టీ పెట్టాలి .. తెలంగాణలాగే దేశాన్నీ బాగు చేయాలి - కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి !

కేసీఆర్ ఆలస్యం చేయకుండా జాతీయ పార్టీ పెట్టాలని టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను బాగు చేసినట్లే దేశాన్ని బాగు చేయాలంటున్నారు.

KCR National Party :   టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న డిమాండ్ పార్టీలో  అంతకకూ పెరుగుతోంది.  టీఆర్ఎస్ జిల్లాల పార్టీల అధ్యక్షులంతా ప్రెస్‌మీట్ నిర్వహించి కేసీఆర్ దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని మోడీ వందేళ్లు వెనకకు తీసుకెళ్లారని.. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రకటించారు.  అన్ని వర్గాల నుంచి ఏకోన్ముఖం గా వినిపిస్తున్న మాట ఈ దేశాన్ని కాపాడుకోవాలని ..దేశం లోని అన్ని వర్గాలు మేధావులు పార్టీ ల నేతలు కేసీఆర్‌ను సంప్రదిస్తున్నారని గుర్తుచేశారు.   జిల్లా అధ్యక్షులు గా కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాo.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే  జాతీయపార్టీ పెట్టాల్సిందేనన్నారు. తెలంగాణ ను బాగు పరిచినట్టే కేసీఆర్ దేశాన్ని బాగు పరచాలని వారు కోరారు.
జాతీయ పార్టీ పెట్టాలి .. తెలంగాణలాగే దేశాన్నీ బాగు చేయాలి - కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి !

దేశం కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నదని.. జేపీ ముక్త్ భారత్ దిశగా కేసీఆర్ తన శక్తి సామర్ధ్యాలు వినియోగించాలని  జిల్లాల అధ్యక్షులు కోరారు.  భారత్ కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత చేతి లో ఉండాలని..  కేసీఆర్ ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని అమలు చేస్తామని జిల్లా అధ్యక్షులు ప్రకటించారు.  తెలంగాణ మోడల్ దేశానికి అవసరం.. నయా భారత్ దిశగా కేసీఆర్ నడుం బిగించాలని  పిలుపునిచ్చారు.   మునుగోడు సభ నుంచి నిజామాబాద్ సభ దాకా ప్రజలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకున్నారని..  అసాధారణ వనరులున్న దేశానికి అసాధారణ తెలివి తేటలున్న కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని మేము ముక్త  కంఠం తో కోరుకుంటున్నామన్నారు.  

రావాలి కేసీఆర్.. కావాలి కేసీఆర్.. గెలవాలి కేసీఆర్ నినాదం ఇచ్చారు.  .జాతీయ సంపదను పేదలకు పంచిపెట్టాలంటే కేసీఆర్ దేశానికి కావాలి.. తెలంగాణ పథకాలు దేశం లో కావాలంటే కేసీఆర్ రావాలి.. రైతులకు ఉచిత కరెంటు కేసీఆర్ తోనే సాధ్యమని జిల్లా నేతలు స్పష్టం చేశారు.  .సంఖ్యా బలం ముఖ్యం కాదు సంకల్ప బలం ముఖ్యం అది కేసీఆర్‌కు ఉందన్నారు.  తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సంకల్పం  మొదలైంది.. ఇపుడు దేశ పునర్నిర్మాణం కేసీఆర్ సంకల్పం తోనే సాధ్యమవుతుందన్నారు.  దేశంలో మోడీ మోసాలు అమిత్ షా ఆగడాలు పోవాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు. 

కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను దేశ ప్రజలు నమ్ముతున్నారు ..హైద్రాబాద్ అభివృద్ధి ని కేసీఆర్ చేసి చూపించారు.. దేశం కూడా అభివృద్ధి కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమన్నారు.  మోడీ ఉచితాలను ఎత్తి వేయాలని కోరుకుంటున్నారని.. కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ఆదర్శ రాష్ట్రం గా మారింది.. భవిష్యత్ లో భారత్ కూడా ప్రపంచం లో ఆదర్శ దేశంగా మారాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలన్నారు.  దేశ భవితవ్యం బీజేపీ హాయం లో ప్రమాదం లో పడింది కాబట్టి  దేశాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నేతలు మూకుమ్మడిగా పిలుపునిచ్చారు.  దేశాన్ని పీవీ తరహాలో సమర్ధంగా నడిపించే శక్తి సామర్ధ్యా లు  కేసీఆర్ కున్నాయన్నారు. కేసీఆర్ ఇక మాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ రాజకీయాల్లోకి రావాలి ..కరీంనగర్ లోనే మొదటి సభ పెట్టాలని కోరారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget