అన్వేషించండి

PM Modi: ప్రధాని మోదీ సంగారెడ్డి పర్యటన వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Parliament Elections: మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటించన్నారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

Sangareddy: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ.. సోమవారం ఆదిలాబాద్‌లో పర్యటించారు. ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన మోదీ.. మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సోమవారం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు మోదీ చేరుకున్నారు. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని మహాకాళీ అమ్మవారిని మోదీ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాకాళీ అమ్మవారి దర్శనం పూర్తైన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డికి మోదీ వెళ్లనున్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న మోదీ.. అనంతరం పటాన్ చెర్వులో జరిగే బీజేపీ విజయ సంకల్ప  బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన క్రమంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9.50 గంటల నుంచి 10.15 గంటల మధ్య రాజ్‌భవన్-బేగంపేట ఎయిర్‌పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్

10 గంటలకు మోదీ పటాన్ చెర్వు చేరుకోనున్నారు. 10.40కు పటేల్‌గూడలో జరిగే కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని పలు అభివృద్ది పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.  రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేను ప్రారంభించనుండగా, సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్లతో ఎన్‌హెచ్-65ను ఆరు లైన్లుగా విస్తరించే పనులకు, మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో నిర్మించనున్న ఎన్‌హెచ్ 765డి విస్తరణ, రూ.500 కోట్లతో చేపట్టనున్న ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం 11.20 గంటలకు పటేల్ గూడలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

సభాస్థలి వద్ద ఆంక్షలు

మోదీ పర్యటన వేళ ఇప్పటికే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మందితో మూడెంచల భద్రత  ఏర్పాటు చేశారు. బహిరంగ సభ జరిగే ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సభకు హాజరయ్యేవారిని క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారు. సెల్ ఫోన్లను మాత్రమే లోపలికి అనుమిస్తామని, వేరే వస్తువులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. అటు రెండు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా  చాటాలని చూస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటన చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి షెడ్యూల్ కంటే ముందు ప్రకటించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Embed widget