అన్వేషించండి

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి

Hyderabad Ganesh Immersion : హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు వస్తుండటంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Traffic Restrictions : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు ప్రకటించారు.  హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు వస్తుండటంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిమ‌జ్జ‌నం జ‌రిగే సమయంలో తిరిగే సిటీ ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆంక్ష‌లు విధించిన‌ట్లు వారు తెలిపారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి ఈ నెల 18న ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండనున్నాయి. సిటీ వ్యాప్తంగా మొత్తం 67 డైవ‌ర్ష‌న్ పాయింట్లు ఏర్పాటు చేశారు పోలీసులు.  ప్ర‌ధాన శోభాయాత్ర జ‌రిగే రూట్‌లో ఇత‌ర వాహ‌నాల‌కు పర్మీషన్ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.


ప్రజలు సహకరించాలి
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాన రహదారులపై విగ్రహాల ఊరేగింపులను అనుమతించేందుకు సాధారణ ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఇక, బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని సీపీ ఆనంద్ తెలిపారు.  కాబట్టి, కేశవగిరి వద్ద అంబేద్కర్ విగ్రహం, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ (ఎడమవైపు మలుపు), మహబూబ్ నగర్ X రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొహంజాయి మార్కెట్, అబిడ్స్ x రోడ్, బషీర్‌బాగ్, ఎన్టీఆర్ మార్గ్ లాని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఆ రూట్లో నిమజ్జనం పూర్తయిన వాహనాలు 
అలాగే మెహిదీప‌ట్నం నుంచి వ‌చ్చే బ‌స్సులను మాస‌బ్‌ట్యాంక్ వ‌ద్ద‌, కూక‌ట్‌ప‌ల్లి నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను ఖైర‌తాబాద్ వ‌ద్ద నిలిపివేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ క్రాస్ రోడ్డు వ‌ర‌కే అనుమ‌తించ‌నున్నారు. గ‌డ్డి అన్నారం, చాద‌ర్‌ఘాట్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వ‌ద్ద‌, ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను ఐఎస్ స‌ద‌న్ వ‌ద్ద నిలిపివేస్తామన్నారు. ఇంట‌ర్ సిటీ స్పెష‌ల్ బ‌స్సుల‌ను నారాయ‌ణ‌గూడ‌, ఎన్టీఆర్ స్టేడియం వ‌ర‌కే అనుమతించనున్నారు. ఇక మెహిదీప‌ట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే బ‌స్సుల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తామన్నారు. ఎన్టీఆర్ మార్గ్‌, నెక్లెస్ రోడ్డులో నిమ‌జ్జ‌నం పూర్త‌యిన వాహ‌నాల‌ను ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ట్యాంక్ బండ్ మార్గంలో నిమ‌జ్జ‌నం పూర్త‌యిన వాహ‌నాల‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మ‌ళ్లించ‌నున్నారు.


సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాల రూట్
అలాగే, సికింద్రాబాద్‌ నుంచి వినాయక విగ్రహాల ఊరేగింపులు.. సంగీత్‌ థియేటర్‌, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్‌, ఎంజీ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు వెళ్తాయి. చిలకలగూడ కూడలి నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, నారాయణగూడ ఫ్లైఓవర్‌, వై.జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో పాటు ఉప్పల్‌ నుంచి వచ్చే గణేష్‌ ఊరేగింపులు రామంతాపూర్‌, శ్రీరమణ జంక్షన్‌, తిలక్‌నగర్‌, ఓయూ ఎన్‌సీసీ గేట్‌, విద్యానగర్‌ జంక్షన్‌, ఫీవర్‌ హాస్పిటల్‌, బర్కత్‌పురా జంక్షన్‌ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో పాటు ఐఎస్‌ సదన్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ నుంచి గణేష్‌ విగ్రహాలతో దిల్‌ సుఖ్‌నగర్‌ నుంచి వస్తున్న ఊరేగింపు నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తుందని హైదరాబాద్‌ నగర పోలీసులు తెలిపారు. ఇక, తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం రోడ్డు మీదుగా విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆస్పత్రికి చేరుకుంటాయి. అలాగే టోలీచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారీ భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్తాయి. ఇక ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా, మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారీ భవన్‌కు చేరుకుని ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటుంది.

ప్రయాణం ప్లాన్ చేసుకోండి
అలాగే టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు సీతారాం బాగ్‌, బోయిగూడ కమాన్‌, వోల్గా హోటల్‌ ఎక్స్‌ రోడ్డు, గోషామహల్‌, మాలకుంట జంక్షన్‌ మీదుగా ఎంజేఎం దగ్గర ప్రధాన ఊరేగింపులో కలుస్తాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సామాన్యుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని.. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని.. ప్రజలు తమ ప్రయాణ మార్గాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget