Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
Traffic Jam : దసరా పండుగ జరుపుకుని సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
![Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు Traffic Jam at Panthangi Toll plaza chotuppal On Hyderabad-Vijayawada High Way Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/65368dbf6ddec938021badc22745bee0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad-Vijayawada High Way: తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి పండుగలు అతి ప్రధానమైనవి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు దసరా పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటే.. ఏపీ ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. అయితే పండుగకు ఊరెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఉంటుందో తెలిసిందే. ఎక్కడికక్కడ భారీగా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నిలిచిపోతుంటాయి. పండుగ పూర్తయ్యాక హైదరాబాద్‌కు తిరిగి వచ్చే సమయంలోనూ అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతాయి.
దసరా ఎఫెక్ట్.. కిలోమీటర్ల మేర వాహనాలు
దసరాకు ఊరెళ్లిన వారు ఆదివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయాయి. ప్రతి ఏడాది తరహాలోనే పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దసరా సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. సోమవారం నుంచి తిరిగి యథావిధిగా ఆఫీసులు, సంస్థలు తెరుచుకోనున్నాయి. దసరా జరుపుకుని హైదరాబాద్‌కు పయనం కావడంతో హైవేపై పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని
ఒకే రోజు తిరుగు పయనం కావడంతో ట్రాఫిక్ కష్టాలు..
రేపటి నుంచి తమ పనులకు యథావిధిగా వెళ్లడంలో భాగంగా సొంతూళ్ల నుంచి ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఊళ్లకు వెళ్లేటప్పుడు రెండు మూడు రోజులు తమకు వీలైన సమయంలో వెళ్లేవారు ఆదివారం ఒక్కసారిగా హైదరాబాద్‌కు పయనం కావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాధారణ వేగంగా సైతం వెహికల్స్ వెళ్లడానికి వీలు అవకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చౌటుప్పల్‌లోనూ ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ పెరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రతి ఏడాది దసరా, సంక్రాంతి పండుగల తరువాత ఈ సమస్య తలెత్తుతుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: జగన్ ఎన్డీఏలో చేరితే ఏపీ మరింత అభివృద్ధి... 3 రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిది... కేంద్రమంత్రి అథవాలే షాకింగ్ కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)