అన్వేషించండి

Hawala Money: రూ.3.35 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత - ఎన్నికల కోడ్ వేళ విస్తృత తనిఖీలు

ఎన్నికల వేళ భారీగా హవాలా సొమ్ము పట్టుబడుతోంది. పోలీసుల విస్తృత తనిఖీల్లో బంజారాహిల్స్ లో రూ.3.35 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడతున్నారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని భారీగా హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు రూ.3.35 కోట్ల నగదును బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాల సేకరణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు.

కోడ్ అమలుతో విస్తృతంగా తనిఖీలు

కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు, ఆభరణాలు, ఎన్నికల ప్రచార సామగ్రికి కూడా పోలీసు నిబంధనలు వర్తించనున్నాయి. గుర్తింపు పత్రాలు లేకుండా నగదు కనబడితే వెంటనే సీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైవేపై వెళ్తున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు.

భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5.65 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్ లను కూడా సీజ్ చేశారు. బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండిని అబిడ్స్ పోలీసులు సీజ్ చేశారు. బంగారం 16 కేజీల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి విలువ రూ.10 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

నగదూ స్వాధీనం

ఫిలింనగర్ లో ఓ కాలేజ్ వద్ద కారులో తరలిస్తున్న రూ.30 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
షాద్ నగర్ లోని రాయికల్ టోల్ ప్లాజా దగ్గర సోదాల్లో రూ.18.50 లక్షలు సీజ్.
చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో వాహన తనిఖీల్లో రూ.9.30 లక్షల నగదు స్వాధీనం. వనస్థలిపురంలోనూ వాహన తనిఖీల్లో రూ.4 లక్షలు సీజ్ చేశారు.

ఇతర జిల్లాల్లోనూ

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో వాహన తనిఖీల్లో రూ.9.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని కారణంగా డబ్బు సీజ్ చేసినట్లు చెప్పారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుంపూర్ బస్టాప్ వద్ద తనిఖీల్లో రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ కమ్మర్పల్లిలో 63వ నెంబర్ జాతీయ రహదారిపై కారులో తరలిస్తోన్న రూ.5.40 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. 

పోలీసుల సూచనలు 

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తెలంగాణ పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. రూ.50 వేలకు మించి నగదుతో వెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు, రశీదులు, డాక్యుమెంట్లు కచ్చితంగా వెంట ఉంచుకోవాలని సూచించారు. అలా లేని క్రమంలో నగదు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రభుత్వ సొమ్ముతో పార్టీలు, తమ నివాసాల వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. సొంత ఖర్చుతో మాత్రం ఈ కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతి ఉందని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget