By: ABP Desam | Updated at : 07 Jan 2022 06:31 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం సూసైడ్ పై మంత్రి కేటీఆర్ స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ బయట జరిగే ప్రతీ విషయానికి స్పందించే ట్విట్టర్ మంత్రి కేటీఆర్.... పాల్వంచ కుటుంబం ఆత్మహత్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. '13 ఏళ్ల ఇద్దరు బాలికలతో సహా మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే మీ మనసు చలించలేదా? నిందితుడు ఎమ్మెల్యే కొడుకు కాబట్టి కాపాడుతున్నారు. మీ అమానుషానికి హద్దే లేదా?' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Twitter minister @KTRTRS responds to every incident happening outside Telangana….
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2022
But not moved by the suicide of a total family including two young girls of age 13 in the state?@TelanganaCMO safeguarding the culprit as he is MLA’s son.
There is a limit to being inhuman…
హోంమంత్రికి ఫిర్యాదు
పాల్వంచ ఘటనపై కాంగ్రెస్ నాయకులు హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెసు నాయకులు కట్ల శ్రీనివాస్, రాంశెట్టి నరేందర్, సంజయ్ యాదవ్, శ్రీధర్ గౌడ్ హోంమంత్రిని కలిశారు.
Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన
ప్రభుత్వమే వనమాను రక్షిస్తుంది
పాల్వంచ ఘటన అత్యంత అవమానకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావ్ అన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్ర మహిళ మంత్రులకు ఈ ఘటన పై మాట్లాడే తీరిక లేదా అన్నారు. నిందితుడిని కావాలనే అరెస్టు చేయడం లేదన్న అనుమానం కలుగుతోందన్నారు. వనమా రాఘవను ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టు చేయడంలో ఉన్న చిత్త శుద్ధి నేరాలు చేసిన అధికార పార్టీ నేతలను అరెస్టు చేయడంలో ఎందుకు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 24 గంటల్లో వనమా రాఘవని అరెస్టు చేయకపోతే సీఎం కేసీఆర్, కేటీఆర్ కు గాజులు పంపుతామని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మనువడిని ఒక మాట అంటే గగ్గోలు పెట్టిన సీఎం కేసీఆర్... ఒక మహిళతో పాటు కుటుంబం మొత్తానికి అన్యాయం జరిగితే కనపడడం లేదా అని సునీతా రావ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తక్షణమే రాజీనామా చేయాలని, పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Breaking News Live Telugu Updates: మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎంను అంతమాట అనేశారే!
Eetala Lands Distribution : ఈటలకు కేసీఆర్ సర్కార్ షాక్ - ఆ భూములన్నీ దళితులకు పంపిణీ !
TS Inter Students Suicide: ముగ్గురు ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు తీసిన ఫలితాలు - తక్కువ మార్కులొచ్చాయని సైతం !
Konda Vishweshwar Reddy: బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి! టీఆర్ఎస్ మాజీ ఎంపీతో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ భేటీ?
Hyderabad Flexies: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రగడ! ‘సాలు దొర, సంపకు దొర’ అంటూ పోటాపోటీగా ఏర్పాట్లు
Raghurama CID : హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !
Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు
Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!
Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?