అన్వేషించండి

Revanth Reddy: రాత్రి నుంచి అయ్యా, కొడుకులు అంగీలు చించుకుంటున్నరు! - మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్నారని విమర్శించారు.

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా కాంగ్రెస్ మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. దానికి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన దగాకోరును రాబోయే 100 రోజుల్లో గద్దె దించడం గ్యారంటీ అని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి తన ట్విటర్ ఖాతాలో ఏమని రాసుకొచ్చారంటే.. మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ అన్నారు. కాపలా కుక్కలాగా ఉంటానని ప్రజలను మోసం చేస్తూ, ఖజానాను కొల్లగొడుతున్న దొంగల ముఠాను తరిమికొట్టడం గ్యారంటీ అన్నారు. కమీషన్లను దండుకోవడమే  'మిషన్' లాగా పెట్టుకున్న  వసూల్ రాజాల భరతం పడతామని, పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించిన వినాశకారులను పాతరేస్తామన్నారు.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన 'గులామీ' గ్యాంగును పాతాళానికి తొక్కుతామన్నారు. 

నాలుగు కోట్ల ప్రజల కళ్లుగప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల ముసుగులను ఊడదీసి ప్రజాక్షేత్రంలో ఉరికిస్తామని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అధికారం శాశ్వతం అనుకుని నీలిగిన నిజాం రాచరికాన్నే పీచమణిచిన గడ్డ తెలంగాణ అని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఓ లెక్కా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 

మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే?
కాంగ్రెస్‌ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఫైరయ్యారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని, కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతవుతుందని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని చెప్పారు.

దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం తధ్యమని, బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా, ధీమా గల్లంతవుతాయన్నారు. సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం తప్పదని వెల్లడించారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీనెక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేస్తారని తెలిపారు. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ అని, స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget