Congress : ట్రబుల్ షూటర్ కే ట్రబుల్ ఇచ్చిన టీపీసీసీ నేతలు
ఏ సమస్య అయినా సరే పరిష్కరించడంలో ఆయన దిట్ట. అలాంటి ట్రబుల్ షూటరే షాకయ్యాడు. నాట్ ఓన్లీ షాక్ సింపుల్ గా చెప్పాలంటే షేక్ అయి తట్టా బుట్టా సద్దేశాడంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురించి తెలియని పొలిటికల్ పార్టీ, రాజకీయ నేత ఉండరు. ముఖ్యంగా హస్తం పార్టీలోని ట్రుబల్ షూటర్స్ లో నెంబర్ వన్ ఎవరంటే వెంటనే దిగ్విజయ్ పేరు వినిపిస్తుంది. అలా పార్టీలో తిరుగులేని నేతగా పేరున్న దిగ్విజయ్ వల్ల కూడా సమస్య తీరలేదంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి చిన్నాభిన్నంగానే ఉంది. సరైన లీడర్ లేక ఎవరికి వారే అన్నట్లు ఉంది. ఈ టైమ్ లో ఉత్తమ్ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమస్యలు మరింత జఠిలంగా మారాయి. రోజురోజుకి రేవంత్ పై వ్యతిరేకత పెరుగుతున్నా అధిష్టానం చూసీ చూడనట్లు వ్యవహరించింది. చివరకు పరిస్థితి చేయిదాటిపోయే సీనియర్లంతా ఒక్కటై తిరుగుబాటు జెండా ఎగరేసే వరకు వచ్చింది. కాంగ్రెస్ పెద్దలకు సమస్య ఎంత క్లిష్టమైనదో అర్థం కాలేదు. రంగంలోకి దిగిన ట్రుబల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో నేతలంతా ఒక్కక్కరిగా విన్నపాలు వినిపించారు. రేవంత్ వర్సెస్ రేవంత్ వ్యతిరేక వర్గం ఇలా అందరీ వాదనలు విన్నారు. వాళ్లంతా ఎవరికి తోచినట్లు, వారి వారి స్టైల్లో ఫుల్ గా చెప్పేశారు. ఇవన్నీ విని షాకవ్వడం దిగ్విజయ్ వంతు అయ్యింది. వీళ్ల మాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు విని దిగ్గి రాజా షాక్ అయ్యారంట. పెద్దాయన ఊహించుకొని వచ్చింది ఒకటి తీరా చూసింది మరొకటి అయ్యేసరికి మైండ్ బ్లాక్ అయ్యిందట. ఎంత సర్దిచెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేకపోవడంతో ఇంతటితో సమాప్తం అని సమావేశానికి ముగింపు పలికి వెళ్లిపోయారు. రెండో రోజు ఉదయాన కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం పెట్టారు. వచ్చాము కాబట్టి అధికారపార్టీపైనా విమర్శలు చేశారు. అలాగే కేంద్రంపైనా వ్యతిరేకంగా మాట్లాడారు. మోదీని టార్గెట్ చేస్తూ నాలుగు ముక్కలు మాట్లాడేసి రాహుల్ గాంధీ పాదయాత్రకి అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పేసి మీడియా ప్రశ్నలకు అలా ఇలా అంటిముట్టనట్లు సమాధానాలు చెప్పి వెళ్లిపోయారు.
ఈలోపు మీడియా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏందయ్యా అంటే ఇవన్నీ మాములే. మేమంతా కలిసి బీఆర్‌ఎస్, బీజేపీని ఎదుర్కోవడానికి ఒక్కటై వస్తామని చెప్పి తప్పుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఇంచార్జ్ ని మార్చే పొజిషనల్లో లేనని చెప్పడంతో గత కొద్దిరోజులుగా వినిపిస్తోన్న మాటలు నిజమని స్పష్టమయ్యాయి.రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన్ను తొలగించాలని సీనియర్లు కొందరు పట్టుబట్టారు. కానీ అధిష్టానం పట్టించుకోలేదు. జీహెచ్ ఎంసీ, ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయం వెనక రేవంత్ తోపాటు ఆయనకు వత్తాసు పలుకుతున్న ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ని కూడా మార్చాలని ఢిల్లీ పెద్దలకు తెలంగాణ సీనియర్లు వినతులు ఇచ్చారు. కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఈ క్రమంలోనే జాతీయ అధ్యక్షుడి ఎన్నికల్లో సీనియర్లకి చెందిన చాలామంది నేతల ఓట్లు గల్లైంతయ్యాయి. ఈ ఇష్యూ గురించి కూడా పెద్దలు పట్టించుకోలేదు. చివరికి కమిటీల్లో కూడా సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడంతో ఇక లాభం లేదనుకొని నిరసనగళమెత్తారు. అంతేకాదు పీసీసీ, ఇంచార్జ్ లిద్దరినీ మార్చేవరకు ఈ తిరుగుబాటుని కంటిన్యూ చేస్తామని చెప్పడమే కాదు చేతల్లోనూ దిగ్విజయ్ ఎదుట చూపించేసరికి ఈ యవ్వారం నాతో కాదని ఆయనకు అర్థమైందట. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం లేదంటే మీ ఇష్టం అని చెప్పేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఏఐసీసీ అధ్యక్ష్యుడు మల్లిఖార్జున ఖర్గేకు, కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రిపోర్ట్ దిగ్విజయ్ సింగ్ అందించనున్నారు. దీంతో ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకలు చొరవ తీసుకుంటే కానీ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మారదంటున్నాయని గాంధీభవన్ వర్గాలు. మరి చూడాలి ఏమౌతుంది. టీపీసీసీ గాఢీన పడుతుందా? ఎన్నికలకు సిద్దం అవుతుందా? లేక ఇలా ఇంటర్నల్ పాలిటిక్స్ తోనే సతమతమౌతుందా?