Top Headlines Today: చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాములేనని జగన్ ఆరోపణలు!- బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా రిలీజ్
Top 5 Telugu Headlines Today 7 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 7 November 2023:
కేసీఆర్ ప్లాన్‌తో పోటీకి కాలు దువ్విన కాంగ్రెస్, బీజేపీ- రేవంత్, ఈటల పోటీ వెనుక రాజకీయ వ్యూహం ఇదేనా ?
రాజకీయాలను చదరంగంతో పోల్చుతారు. చదరగంలోని 64 గడులలో మంత్రి, బంటు, ఎనుగు ఇలా సైనిక పటాలం వ్యూహాత్మకంగా కదులుతూ చివరి టార్గెట్ రాజును చేయడంతో గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో ఆయనకు చెక్ పెట్టే ప్లాన్స్ రడీ అవుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికల్లో తొలిసారిగా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా రిలీజ్ - 12 మందికి అవకాశం, మాజీ గవర్నర్ కు నిరాశ
తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాను మంగళవారం విడుదల చేసింది. 12 మందితో ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటివరకూ మొత్తం 100 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పెండింగ్ లో 19 స్థానాలున్నాయి. జనసేన అడుగుతున్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు నిరాశ ఎదురైంది. ఆయన తనయుడు వికాస్ రావు వేములవాడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. వేములవాడలో తుల ఉమకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాములే' - నాలుగేళ్లలో రూ.33,209 కోట్లు రైతులకు అందించామన్న సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలేనని సీఎం జగన్ విమర్శించారు. ఆయన హయాంలో స్కీంల గురించి కాకుండా స్కాంల గురించే ఆలోచించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరువేనని, రైతు రుణ మాఫీ మాట తప్పారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని, వారికి పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచనే చేయలేదని మండిపడ్డారు. పుట్టపర్తి సభలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. 'వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్బీకేల ద్వారా రూ.60 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన - చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు !
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసం, ప్రజా కంటక పాలనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లిన నారా లోకేష్ గంటకుపైగా రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్‌కు వివరించారు. ఎనిమిది పేజీల సమగ్రమైన లేఖను అందించారు. ఇందులో 29 అంశాల గురించి ప్రస్తావించారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని నారా లోకేష్ గవర్నర్ కు వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని కోరుకోరమ్మా - పురందేశ్వరిపై విజయసాయి ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడుక్కుతున్నాయి. అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మధ్య ట్వీట్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పురందేశ్వరి ఆరోపణలు, ట్వీట్లపై వైసీపీ నేతలు ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. వీరిలో విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందులోనే ఉన్నారు. పురందేశ్వరి రాజకీయ చరిత్ర నుంచి మొదలు చంద్రబాబు అరెస్ట్ వరకు విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















