అన్వేషించండి

Nara Lokesh : ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన - చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు !

ఏపీని దక్షిణాది బీహార్‌గా మార్చేశారని నారా లోకేష్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

 

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసం,  ప్రజా కంటక పాలనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లిన నారా లోకేష్ గంటకుపైగా రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్‌కు వివరించారు. ఎనిమిది పేజీల సమగ్రమైన లేఖను అందించారు. ఇందులో 29 అంశాల గురించి ప్రస్తావించారు.  చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని నారా లోకేష్ గవర్నర్ కు వివరించారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై ఇప్పటి వరకూ పెట్టిన కేసుల జాబితాను కూడా ఈ సందర్భంగా టీడీపీ బృందం గవర్నర్ కు ఇచ్చింది. నారా లోకేష్ తో పాటు గవర్నర్ ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబులు ఉన్నారు.

కక్ష సాధింపు రాజకీయాలతో పాలన                      

వైసీపీ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలతో ఏపీలో టెర్రర్ వాతావరణాన్ని సృష్టిస్తోందని.. ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై తలాతోక లేని దొంగ కేసులు పెట్టి ఎన్నికల సన్నాహాల్లో పాల్గొనకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలకు  భయపడేది లేదని తొక్కుకుంటూ వెళ్తామని నారా లోకేష్ హెచ్చరించారు. ఏపీని దక్షిణాది బీహార్ రాష్ట్రంలో మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలపై సాక్ష్యాధారాలతో సహా గవర్నర్‌కు వివరించామన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల వివరాలు.. కుట్రపూరితమని.. వాటి గురించిన పూర్తి సమాచారాన్ని గవర్నర్‌కు ఇచ్చామన్నారు. ఏపీని దక్షిణాది బీహార్‌లాగా మార్చేశారని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.  

తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!

17ఎకి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని చెప్పాం, వివరాలన్నీ తెప్పించుకుంటామని చెప్పారు. భయం మా బయోడేటాలో లేదు... పోరాటమే, అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం. చంద్రబాబు ఇంటీరియమ్ బెయిల్ పై ఉన్నారు, 10వతేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది, వచ్చే తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం అనివార్యం, రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టిడిపి కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా చూస్తున్నామని లోకేష్ తెలిపారు. 

రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టిడిపి బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది, 6లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దొంగఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగఓటు ఉంది, సిఎం 38కేసుల్లో దొంగ, 10సంవత్సరాల కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగ, సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్, అవినాష్ రెడ్డిని కాపాడటానికి సిబిఐని ఎపికి రానీయకుండా చేశారు. దొంగనుంచి మంచి పరిపాలన ఎలా ఆశిస్తాం? జగన్ పై 38కేసులు ఉన్నాయి, 11సిబిఐ, 7 ఈడి కేసులు ఉన్నాయి. పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నాడు, ఏ తప్పు చేయని చంద్రబాబును 38కేసులున్న వ్యక్తి 53రోజులు జైలులో ఉంచాడు, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అంటున్నాం. 2019నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం అమలవుతోంది.

నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం!

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్షనేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జెఎసి మీటింగ్ లో కూడా టిడిపి సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం, చాలా బాగుతున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జెఎసి మీటింగ్ లో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నామని లోకేష్ తెలిపారు.
 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget