అన్వేషించండి

Top 5 Headlines Today: అమరావతి ఆర్‌5 జోన్‌లో ఇళ్ల పట్టదారులకు గుడ్ న్యూస్- తెలంగాణలా మహారాష్ట్ర అభివృద్ధి చెందాలన్న కేసీఆర్ !

Top 5 Telugu Headlines Today 27 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ - మహారాష్ట్ర కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలన్న కేసీఆర్ !
తెలంంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూంటే.. మహారాష్ట్రలో మాత్రం ఆ పరిస్థితి లేదని  కేసీఆర్ అన్నారు. తెలంగాణలా మహారాష్ట్ర కూడా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అన్ని వనరులు ఉన్న మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఎందుకు అభివృద్ధి చెందకూడదని ప్రశ్నించారు.  సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ   బహరింగసభను నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ బహిరంగసభకు హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కొత్త అర్థం చెప్పారు కేసీఆర్. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయన్నారు. దేశాన్ని కాంగ్రెస్ దాదాపుగా యాభై ఏళ్లు పరిపాలించిందన్నారు.  పూర్తి వివరాలు

కాంగ్రెస్ లోనే ఆ దరిద్రం - ఢిల్లీలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు !
కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపురించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని... పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదన్నారు. మీడియా అడిగేదాంట్లో తప్పు లేదని తెలిపారు.  రాహుల్ గాంధీకి  అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు.    పూర్తి వివరాలు   

పవన్ కల్యాణ్ కు స్వల్ప అనారోగ్యం - కార్యక్రమాలన్నీ రీషెడ్యూల్‌!
జనసేన అధినేత పవణ్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఉపవాస దీక్ష కూడా చేస్తున్నారు. పెదఅమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్  హాల్లో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జనసేనాని అస్వస్థతకు గురి కావడంతో ఉదయం 11 గంటలకు జరగాల్సిన భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని  రీ షెడ్యూల్ చేశారు. ఈ సమావేశం మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇత పార్టీలకు చెందిన నేతలు పవన్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరనున్నారు.  పూర్తి వివరాలు  

అమరావతి ఆర్‌5 జోన్‌లో ఇళ్ల పట్టదారులకు కేంద్రం గుడ్ న్యూస్- 47 వేలకుపైగా గృహాలు మంజూరు
అమరావతిలోని ఆర్‌5 జోన్‌లో ఇళ్ల పట్టాలు అందుకున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేసిన కేంద్రం వారికి ఇళ్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 8న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడానికి మార్గం ఈజీ అయ్యింది. మే 26న అట్టహాసంగా అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణిని జగన్ సర్కారు ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.  పూర్తి వివరాలు  

అభిమాని మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్యామ్ మర్డర్ మిస్టరీ
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమాని శ్యామ్ (NTR Fan Shyam) రెండు రోజుల క్రితం మరణించారు. అతడి మృతి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని వినబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను శ్యామ్ మర్డర్ మిస్టరీ షేక్ చేస్తోంది. అభిమాని మృతి విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని జూనియర్ ఎన్టీఆర్ ఓ లేఖ విడుదల చేశారు. అభిమాని కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget