అన్వేషించండి

Top 5 Headlines Today: కేంద్రంపై అవిశ్వాస తీర్మానంతో బీఆర్‌ఎస్‌ భారీ స్కెచ్- సీమ సాగునీటి ప్రాజెక్టులకు జగన్ సర్కార్ ద్రోహం!

Top 5 Telugu Headlines Today 26 July 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top Telugu Headlines Today 26 July 2023: 
అవిశ్వాస తీర్మానంతో బీఆర్‌ఎస్‌ భారీ స్కెచ్- ఇక ఆ విమర్శలకు చెక్‌ పెట్టినట్టేనా!
కేంద్రంపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు అవిశ్వాస అస్త్రంతో యుద్ధం పునఃప్రారంభించింది. మూడు నెలల క్రితం వరకు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే కేసీఆర్‌ ఈ మధ్య సైలెంట్‌ అయిపోయారు. అప్పుడప్పుడూ కేటీఆర్‌ సహా ఇతర మంత్రులు మాట్లాడటమే తప్ప పెద్దగా ఎదురు దాడి చేసింది లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్‌ ఆ రెండు పార్టీలపై విమర్శల స్వరాన్ని పెంచింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ గట్టిగానే ప్రచారం చేశాయి. దీనికి బీజేపీ అధ్యక్షుడి మార్పును కూడా ప్రస్తావించింది. అయితే వాటిని ఖండించేలా జరుగుతున్న ప్రచారాన్ని తప్పు పట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్ చేసింది.  పూర్తి వివరాలు  

సీమ సాగునీటి ప్రాజెక్టులకు ద్రోహం - జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఆగ్రహం
రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు పూర్తిగా తగ్గించేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.  రాయలసీమ మొత్తం 12 ప్రాజెక్టులకు తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టింది 12 వేల కోట్లు జగన్ తన హయం లో ఖర్చు పెట్టింది 2000 కోట్లు మాత్రమే  ఖర్చు పెట్టారని ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో జరిగిన సమావేశంలో సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు, రాయలసీమకు నళ్లిచ్చిలా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.  2014-19 మధ్య ఇరిగేషన్ కు  టిడిపి ప్రభుత్వం ఖర్చు  పెట్టింది రూ.68,293 కోట్లు ఖర్చు  అయితే సీఎం జగన్  ప్రభుత్వం  ఖర్చు పెట్టింది రూ. 22165 కోట్లు మాత్రమేనన్నారు.   పూర్తి వివరాలు

ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావుతో ప్రమాణం చేయిస్తారా ? బీఆర్ఎస్‌కు కొత్త సమస్య !
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు నిర్ధారించి ఆయనపై అనర్హతా వేటు వేయడమే కాదు ఐదు లక్షల రూపాయల ఫైన్ వేసింది. రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. దీంతో జలగం వెంకట్రావు.. తీర్పు కాపీతో  సచివాలయానికివచ్చారు. కోర్టు తీర్పును  బట్టి  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. వనమా వెంకటేశ్వరరావుపై 2019 లో హై కోర్టులో పిటిషన్ వేశానని  వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని జలగం వెంకట్రావుచెబుతున్నారు.  పూర్తి వివరాలు  

ఎక్కడా లేని ఫేక్ ఓట్ల వివాదం ఏపీలోనే ఎందుకు ? 
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను ఇష్టారీతిన మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్వయంగా సీఈవో కూడా ఇది నిజమేనని కరెక్ట్ చేస్తామని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత  సీఈవోను.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి క్లాస్ తీసుకున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అసలు ఏపీలో ఓటర్ల జాబితాను అంత సులువుగా మార్చేయవచ్చా ? వాలంటీర్ల ఓట్లను కలపడం.. తీసేయడానికి అధికారం కలిగి ఉన్నారా? ఏపీ ఓటర్ల జాబితాలో అసలేం జరుగుతోంది. పూర్తి వివరాలు 

రైతులకు వద్దకు తెలంగాణ బీజేపీ - క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు కిషన్ రెడ్డి కొత్త ప్లాన్ !
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి పార్టీని క్షేత్ర స్థాయిలో యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్లపై పోరాటం చేస్తున్నారు. తాజాగా  ‘రైతు వద్దకు బీజేపీ' కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణచించారు.  గురువారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా  కిషన్ రెడ్డి ప్రకటించారు . హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన  వ్యవసాయ పద్ధతులపై అవగాహనతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు వివరిస్తామని తెలిపారు. 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామని వివరించారు. వీటిలో తొలిదశలో గురువారం  1.25 లక్షల దుకాణాలను ప్రధాని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.  పూర్తి వివరాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget