Top Headlines Today: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి కారకులు వీరే! తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈసీ లేఖ
Top 5 Telugu Headlines Today 25 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

AP Telangana Headlines Today: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదానికి కారకులు వీరే - సంచలన విషయాలు వెల్లడించిన సీపీ
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదాని (Vizag Harbour Fire Accident)కి కారణాలను నగర సీపీ రవిశంకర్ వెల్లడించారు. సిగరెట్ తాగి పడవేయడంతో అగ్ని ప్రమాదం జరిగి 30 బోట్లు కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనకు వాసుపల్లి నాని, అతడి మామ సత్యం కారకులని భావిస్తూ, వారిని ప్రధాని నిందితులుగా తేల్చినట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour )కేసులో ఈ ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం' - మళ్లీ అధికారమిస్తే దోచుకుంటారని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు ఆదాయం ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దివాలా తీసిందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పదేళ్ల పాలనలో అవినీతి తప్ప ఏం చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు వేలంలో, కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులోనూ భారీగా అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దు' - సీఎం కేసీఆర్ కు ఈసీ లేఖ
సీఎం కేసీఆర్ (CM KCR) కు కేంద్ర ఎన్నికల సంఘం (Central Elections Commission) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ లేఖను సీఈవో వికాస్ రాజ్ (CEO Vikasraj) శుక్రవారం ముఖ్యమంత్రికి పంపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఈసీ తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దని హితవు పలికింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై స్పందిస్తూ బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు - రూ.20 లక్షల నగదు స్వాధీనం, పాతబస్తీలోనూ తనిఖీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) నివాసంలో ఐటీ అధికారులు శనివారం సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని (Tandur) రోహిత్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రజల్లోకి నారా లోకేష్, భువనేశ్వరి - చంద్రబాబు ఎప్పటి నుంచి అంటే ?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్ళి మొదలు కాబోతుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో పాదయాత్రను నిలిపివేసిన లోకేశ్ తిరిగి నవంబర్ 27న ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ రూట్ మ్యాప్ విడుదల చేసింది. యువగళం యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబును అరెస్టు రోజే లోకేశ్ తన యాత్రను పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Telangana Elections 2023: 'ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దు' - సీఎం కేసీఆర్ కు ఈసీ లేఖ





















