Andhra News Nara Lokesh : ప్రజల్లోకి నారా లోకేష్, భువనేశ్వరి - చంద్రబాబు ఎప్పటి నుంచి అంటే ?
Andhra News Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర మళ్లీ ప్రారంభించనున్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.
![Andhra News Nara Lokesh : ప్రజల్లోకి నారా లోకేష్, భువనేశ్వరి - చంద్రబాబు ఎప్పటి నుంచి అంటే ? Nara Lokesh Padayatra will start again Nara Bhuvaneshwari is likely to start the Najah Gelawali Yatra Andhra News Nara Lokesh : ప్రజల్లోకి నారా లోకేష్, భువనేశ్వరి - చంద్రబాబు ఎప్పటి నుంచి అంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/7aaee583624f871badf996302d6375201700901682618228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra News Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్ళి మొదలు కాబోతుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో పాదయాత్రను నిలిపివేసిన లోకేశ్ తిరిగి నవంబర్ 27న ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ రూట్ మ్యాప్ విడుదల చేసింది. యువగళం యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబును అరెస్టు రోజే లోకేశ్ తన యాత్రను పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని మూడు జిల్లాల్ని కలిపేలా పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఇప్పటి వరకు నారా లోకేశ్ 208 రోజులపాటు..2,852 కిలోమీటర్లకు పైగా నడిచారు. అంతేకాదు 84 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగింది. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. ఈ పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేయాలని భావించారు. అయితే రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడటంతో ఈ పాదయాత్ర విశాఖపట్నంలోనే ముగించాలని లోకేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి ఎన్నికలు కూడా సమీపిస్తాయి కాబట్టి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో విశాఖతో ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పాదయాత్ర ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం తాటిపాకలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతం చేసేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఒకవైపు, లోకేశ్ మరో వైపు పాదయాత్రలు చేసి టీడీపీ, జనసేన నాయకుల మధ్య సమన్వయం పెంచి ప్రభుత్వంపై పోరాడుతున్నారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి అన్న పేరుతో ఆమె ఒక యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చేపట్టిన కొద్ది రోజులకే జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడంతో మరో జిల్లా పర్యటన ఖరారు కాలేదు. ిప్పుడు ఆమె పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేశ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తాజిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. భువనేశ్వరి యాత్రం ఆపటం పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. డిసెంబర్ లోనే తిరిగి యాత్ర ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)