Top Headlines Today: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్! జీపీఎస్‌పై ఒకట్రెండు రోజుల్లో ఏపీ సర్కార్ ఆర్డినెన్స్
Top 5 Telugu Headlines Today 21 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 21 August 2023:
బీఆర్ఎస్ జాబితా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఏడుగుర్ని మార్చినట్లు వెల్లడి
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గానూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినట్లు చెప్పారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వైరా, మెట్ పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చానన్నారు. 4 స్థానాలు పెండింగ్ లో ఉంటారు. పూర్తి వివరాలు
జీపీఎస్‌పై ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్- నెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు: జగన్
గతంలో ఎప్పుడూ లేని సంస్కరణలు అమలు చేస్తూనే ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నామని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో 21 వ రాష్ట్ర మహా సభల్లో ప్రారంభోపాన్యాసం చేశారు జగన్. ఏపీ ఎన్జీవో సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల బాగు కోరే ప్రభుత్వంగా జీపీఎస్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. రేపో ఎల్లుండో దీనిపై ఆర్డినెన్స్ వస్తుందని తెలిపారు. నిజాయితీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామన్నారు సీఎం జగన్. దేశంలోని రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. పూర్తి వివరాలు
సీడబ్ల్యూసీలో అనూహ్య మార్పులు - ఖర్గే టీంలో ఆరుగురు తెలుగోళ్లు
2024 సార్వత్రిక ఎన్నికలు, సెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన టీంను బిల్డ్ చేశారు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని 84 మందితో టీంను ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నికై దాదాపు ఏడాది కావస్తున్న టైంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని నియమించారు. రాజీవ్ గాంధీ జయంతి రోజున ప్రకటించిన సీడబ్ల్యూసీలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు జీ-23 నేతలకి కూడా స్థానం కల్పించారు. కొత్తగా నియమించిన సభ్యుల్లో 39 మంది రెగ్యులర్ సభ్యులు ఉంటే... 32 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. పూర్తి వివరాలు
పెత్తనం చేయడానికి హరీష్ ఎవరు? టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్
అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తామని చెబుతున్న బీఆర్‌ఎస్ కాసేపట్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. దీంతో అశావాహులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. టికెట్ దొరకదని అసంతృప్తితో ఉన్నవాళ్లు స్వరాలు పెంచుతున్నారు. ప్రధాన నేతల ఇంటికి టికెట్ల కోసం చక్కర్లు కొడుతున్నారు. టికెట్లు ఖరారు చేసే కోర్ టీంలో హరీష్ రావు ఒకరు. అలాంటి హరీష్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుంత రావు ఫైర్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు
టిక్కెట్ ఇచ్చినా సరే మైనంపల్లి జంప్ - కాంగ్రెస్‌లో డీల్ సెట్ చేసుకున్నారా ?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారు. కానీ.. ఆయన కుమారుడు రోహిత్ రావుకు మాత్రం మెదక్ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో దీంతో మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హన్మంత్ రావు .. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటీ చేసి హరీష్ ను ఓడిస్తానని చాలెంజ్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకువచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు





















