అన్వేషించండి

Mynampalli : టిక్కెట్ ఇచ్చినా సరే మైనంపల్లి జంప్ - కాంగ్రెస్‌లో డీల్ సెట్ చేసుకున్నారా ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. హరీష్ రావుపై సిద్దిపేటలో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

Mynampalli :    బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.   మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారు. కానీ.. ఆయన కుమారుడు రోహిత్ రావుకు మాత్రం మెదక్ టిక్కెట్ ఇవ్వలేదు.  దీంతో  దీంతో మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హన్మంత్ రావు .. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటీ చేసి హరీష్ ను ఓడిస్తానని చాలెంజ్ చేశారు.  శ్రీవారి దర్శనం కోసం తిరుమలకువచ్చిన ఆయన  అక్కడే మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.                       

ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో  మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుకున్నారని..  అందుకే హరీష్ రావును టార్గెట్ చేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యల్లో..  కేసీఆర్ కుటుంబంపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.   హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసీఆర్ కుటుంబం పై వ్యాఖ్యలు చేశారు.  తాను హీరోగా ఉన్నప్పుడు నువ్వు జీరో వని... రబ్బర్ చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.  మీ కుటుంబంలో అందరికీ టికెట్లు ఇచ్చారుగా..  నాకు, నా కొడుకు ఇస్తే తప్పేంటి అని మైనంపల్లి ప్రశ్నించారు.  సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు ని ఓడిస్తా.. ఆయన అంతు చూస్తా.. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పై శపథం చేశారు మైనంపల్లి.                        

మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లాకు చెందిన వారు . తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి అవకాశం లభించకపోవడంతో  బీఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారీగాసేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండే హన్మంతరావు కుమరుడు కూడా ఇటీవలి కాలంలో మెదక్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన కుమారుడికి మెదక్ నుంచే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు. ఈ కారణంగా రోహిత్ రావుకు టిక్కెట్  నిరాకరించారు.                                                                  

అయితే ఏ పార్టీలో ఉన్నా గెలిచి తీరుతారమన్న  నమ్మకంతో ఉన్న మైనంపల్లి.. ఇద్దరికీ  టిక్కెట్ ఇవ్వకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే... తీవ్ర వ్యాఖ్యలుచేసినట్లుగా తెలుస్తోంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Mango Pickle Season: అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
Telangana Modi tour: తెలంగాణపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ - ఐదు రాష్ట్రాల ఫలితాల వెంటే మోదీ జనాగ్రహ సభ !
తెలంగాణపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ - ఐదు రాష్ట్రాల ఫలితాల వెంటే మోదీ జనాగ్రహ సభ !
Telangana Politics: అటు మల్లారెడ్డి.. ఇటు రాజగోపాల్ రెడ్డి - ఇద్దరూ ఇద్దరే.. పార్టీలకు తీరని తలనొప్పి!
అటు మల్లారెడ్డి.. ఇటు రాజగోపాల్ రెడ్డి - ఇద్దరూ ఇద్దరే.. పార్టీలకు తీరని తలనొప్పి!
Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
AP SSC Exam Results 2026: కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
MAVIGUN News: మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
Viral News: పెళ్లి బారాత్‌ డీజేతో కోళ్లు చచ్చిపోయాయి! వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు!
పెళ్లి బారాత్‌ డీజేతో కోళ్లు చచ్చిపోయాయి! వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు!
Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
AP Local Polls: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Embed widget