Top 5 Headlines Today: పవన్ రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్ వచ్చేసింది! తెలంగాణ ప్రాజెక్టుల్లో అంతా అవినీతేనన్న మోదీ!
Top 5 Telugu Headlines Today 08 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top Telugu Headlines Today 08 June 2023:
రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా? - అనంతపురంలో సీఎం జగన్ ప్రశ్న
దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022-ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడారు. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమేనని జగన్ తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు అన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామన్నారు. పూర్తి వివరాలు
తెలంగాణ ప్రభుత్వం నాలుగే పనులు చేస్తోంది- అవినీతి లేని ప్రాజెక్టు లేదు- కేసీఆర్‌పై మోదీ పైర్
తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హనమకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహబిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు తెలంగాణలో లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోందన్నారు మోదీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం మొదటి పని అయితే... కుటుంబ పార్టీని పెంచి పోషించడం రెండో పనిగా చెప్పారు మోదీ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం మూడో పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలు
పవన్ రెండో విడత యాత్ర షెడ్యూల్ ఇదే- రెండు ప్రాంతాల్లో బహిరంగ సభలు
పవన్ కల్యాణ్ చేపట్టే రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. వారాహి విజయయాత్ర పేరుతో ఇప్పటికే మొదటి విడతను పవన్ కల్యాణ్ గత నెలలో పూర్తి చేశారు. ఇప్పుడు రెండో విడత యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జనసేన పార్టీ విడుదల చేసింది. జనసేన ట్వీట్ చేసినట్టుగా వారాహి విజయ యాత్ర రెండో విడత ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అవుతుంది. మొదట ఏలూరులో బహిరంగ సభ ఉంటుంది. అక్కడ పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి వారాహిపై నుంచి మాట్లాడనున్నారు. పూర్తి వివరాలు
దేశ అభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర- వరంగల్ సభలో మోదీ
తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు ప్రధానమంత్రి మోదీ. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమైనది అంటూ కితాబు ఇచ్చారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు ప్రధానమంత్రి. ఇది దేశానికి స్వర్ణయుగమని అభివర్ణించారు. ఆరు వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. పూర్తి వివరాలు
దేశానికి రాహుల్ నాయకత్వం వైఎస్ ఆకాంక్ష - మరోసారి షర్మిల ట్వీట్ కలకలం
రాహుల్ గాంధీ మనసులో ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నందుకు వైఎస్ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే దేశం ఉన్నతంగా పురోగమిస్తుందని వైఎస్ నమ్మకమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందస్భంగా కృతజ్ఞతలు చెబుతూ షర్మిల రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌లో షర్మిల వైఎస్ఆర్ కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ అని.. ప్రజల కోసం చనిపోయారన్నారు. పూర్తి వివరాలు