Top Headlines Today: పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన టీడీపీ నేత చల్లాబాబు - తెలంగాణ బీజేపీలో టిక్కెట్ వేట!
Top 5 Telugu Headlines Today 04 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 04 September 2023:
పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన టీడీపీ నేత చల్లాబాబు, రిమాండ్‌కు తరలింపు
టిడిపి అధినేత నారా చంద్రబాబు పుంగనూరు పర్యటనలో అల్లర్లు చోటు చేసుకున్నాయ్. ఈ కేసులో పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో A1 ముద్దాయిగా చల్లా బాబును చేర్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్నాళ్ళు చల్లా బాబు అజ్ఞాతంలో ఉంటూనే...హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 7 కేసుల్లో 4 కేసులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 3 కేసుల్లో బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో చల్లా బాబు... పుంగనూరు పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. పూర్తి వివరాలు
ఎన్నికల బస్ మిస్సవుతున్న షర్మిల - కాంగ్రెస్ పార్టీ హ్యాండిస్తోందా ?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ తేల్చి చెప్పడం లేదు. విలీనాలు, చేరికల గురించి కాంగ్రెస్ లో వ్యవహారాలను చక్కదిద్దే ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ షర్మిల పార్టీ విలీనంపై ఏమీ చెప్పడం లేదు. వేచి చూడాలని అంటున్నారు. షర్మిల, సోనియా మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని అంటున్నారు. మరి షర్మిల పార్టీ విలీనం అవుతుందా అంటే మాత్రం ఆయన ఏమ చెప్పడం లేదు. మరో వైపు షర్మిల చర్చలు తుది దశకు చేరాయని చెబుతున్నారు కానీ.. పూర్తయ్యాయని చెప్పడం లేదు. దీంతో షర్మిల ఎన్నికల బస్ మిస్సవుతున్నారేమోనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది. పూర్తి వివరాలు
జైల్లోనే అవినాష్ రెడ్డి తండ్రి - బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా అదే జైలులో ఉన్నారు. పూర్తి వివరాలు
కడియం Vs రాజయ్య: ఎదురుపడ్డ ఇద్దరు నేతలు
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా ఉంటున్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే పార్టీలో ఉంటున్న వీరు ఒకరిపై ఒకరు ఎన్నో సందర్భాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అలా ఉప్పు - నిప్పులా ఉన్న వీరు నేడు (సెప్టెంబరు 4) ఎదురుపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారు. పూర్తి వివరాలు
బాబు దోచేసిన సొమ్మును రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకు తీసుకొస్తాం: మంత్రి గుడివాడ
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన విషయంపై అనేక పేపర్లు, ఛానెళ్లలో వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదో తెలియదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తనతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ బాబు సమాధానం కోసం వేచి చూస్తున్నారని అన్నారు. అలాగే చంద్రబాబు చరిత్రే ఓ చీకటి చరిత్ర అంటూ విమర్శించారు. దీని గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినటువంటి తీరు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ సీజన్ - అప్లికేషన్లతో పార్టీ ఆఫీసుకు నేతల క్యూ
తెలంగాణ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించింది. సోమవారం ఉదయం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఇందు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఇది సరికొత్త సంప్రదాయం. పార్టీ చరిత్రలోనే బీజేపీ పార్టీలో తొలిసారి అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకోలేదు. పూర్తి వివరాలు





















