By: ABP Desam | Updated at : 04 Sep 2023 01:47 PM (IST)
ఎన్నికల బస్ మిస్సవుతున్న షర్మిల - కాంగ్రెస్ పార్టీ హ్యాండిస్తోందా ?
Sharmila Politics : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ తేల్చి చెప్పడం లేదు. విలీనాలు, చేరికల గురించి కాంగ్రెస్ లో వ్యవహారాలను చక్కదిద్దే ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ షర్మిల పార్టీ విలీనంపై ఏమీ చెప్పడం లేదు. వేచి చూడాలని అంటున్నారు. షర్మిల, సోనియా మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని అంటున్నారు. మరి షర్మిల పార్టీ విలీనం అవుతుందా అంటే మాత్రం ఆయన ఏమ చెప్పడం లేదు. మరో వైపు షర్మిల చర్చలు తుది దశకు చేరాయని చెబుతున్నారు కానీ.. పూర్తయ్యాయని చెప్పడం లేదు. దీంతో షర్మిల ఎన్నికల బస్ మిస్సవుతున్నారేమోనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.
షర్మిల పార్టీ విలీనంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యతిరేకత
షర్మిల కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ .. షర్మిలతో చర్చలు జరిపారు. కానీ షర్మిల తెలంగాణ పార్టీలోకి వద్దని ఆ పార్టీ నేతలు హైకమాండ్‌కు చెబుతున్నారు. షర్మిల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్‌టీపీ విలీనంపై అసలు ఏమీ చెప్పడం లేదు. కాంగ్రెస్ లో విలీనం అయితే పాలేరులో పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు. పాలేరులో పోటీ చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆమె ఇప్పుడు… తర్వాత చెబుతానని అంటున్నారు. మరో వైపు… ఆమెపై రేణుకాచౌదరి లాంటి వాళ్లు మండిపడుతున్నారు. ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. చివరికి హైకమాండ్ ఏ నిర్ణయమూ తీసుకోకపోతే షర్మలి పరిస్థితి ఇ్బబందికరంగా మారనంది.
పార్టీ కార్యక్రమాలు తగ్గించేసిన షర్మిల
మరో వైపు షర్మిల పార్టీ కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక వేళ కాంగ్రెస్ లో విలీనం లేకపోయినా.. ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో షర్మిల తప్ప మరో నేత ఆ పార్టీలో కనిపించడం లేదు. అభ్యర్థులను బనిలబెట్టే అవకాశం లేదు. షర్మిల పార్టీ పెట్టిన తర్వాత మూడు వేల కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేారు. కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ లో విలీనం పేరుతో ఆమె క్షేత్ర స్థాయికి వెళ్లకుండా సైలెంట్ గా ఉండటంతో ఆ పార్టీ ఎదుగుబొదుగూ లేకుండా పోయింది. విలీనం చర్చలు జోరుగా సాగడం.. అది ఆలస్యం అవుతూండటంతో ఇప్పుడు విలీనం లేకుండా సొంతంంగా పార్టీ నడిపేతే.. కనీస ప్రభావం చూపించలేనంత పరిస్థితి వస్తుంది.
పోటీ చేయకపోతే రాజకీయ జీవితంపై ప్రభావం !
షర్మిల వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆమె రాజకీయ పయనంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోతే సమస్యలు వస్తాయి. వైఎస్ఆర్‌టీపీ విలీనాన్ని కాంగ్రెస్ తో పూర్తి చేసినా షర్మిల పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ లో పరిస్థితులు షర్మిలకు అంత అనుకూలంగా లేవు. విలీనానికి ఓకే కానీ.. ప్రచారం, పోటీ వద్దని కాంగ్రెస్ చెబితే..అది కూజా షర్మిల రాజకీయ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం షర్మిల రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారని.. ఎలాంటి నిర్ణయం తీసుంటారోననే దాన్ని బట్టే.. ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ
Revanth Reddy: టీఎస్పీఎస్సీని ఎందుకు రద్దు చేయలేదు? - సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సూటిప్రశ్న
Telangana Crime News: కొద్ది రోజుల్లో పెళ్లి, అంతలోనే యువతి ఆత్మహత్య - పెళ్లి ఇష్టంలేక సూసైడ్!
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
/body>