Top 5 Headlines Today: మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ! సీఎం జగన్ వస్తే విశాఖకూ విజయవాడ గతేనన్న టీడీపీ!
Top 5 Headlines Today 7th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Headlines Today 7th May 2023:
ఓఆర్ఆర్ లీజు అనుకూల వ్యక్తులకే తక్కువ రేటుకు, అసలు లీజు అవసరమేంటి? - కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును (ఓఆర్ఆర్) ప్రభుత్వం లీజుకు ఇచ్చే విషయంలో విపరీతమైన వివాదాలు నెలకొంటున్న వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం (మే 7) మధ్యాహ్నం కిషన్ రెడ్డి బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. హెచ్ఎండీఏకు ఓఆర్ఆర్ పై టోల్స్ వసూలు చేయడం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు.
లీజు ఏ కంపెనీకి టెండరు రావాలో ముందే సీఎం కేసీఆర్ నిర్ణయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్తూ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను ఎందుకు ప్రైవేటు సంస్థకు లీజుకు ఇస్తోందని ప్రశ్నించారు. ఎన్‌హెచ్ఏఐ నిబంధనల ప్రకారం లీజు ప్రక్రియ జరగడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఇంకా చదవండి
విశాఖకూ విజయవాడ గతే, సీఎం అడుగుపెడితే అంతే - బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు
రాష్ట్రానికి పట్టిన చీడ జగన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16, 17, 18 తేదీల్లో పెందుర్తి, ఎస్ కోట, అనకాపల్లిలో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమం జరుగుతుందని, అ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. పంటకు చీడ పెట్టినట్టు రాష్ట్రానికి జగన్ చీడ పట్టుకుందని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరిష్టాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ఇపుడు మండుటెండల్లో అకాల వర్షాలు కురిసి పంటలు మునిగిపోయాయని అన్నారు. రైతులు విలవిలాడుతుంటే గత ప్రభుత్వంలో చేసిన వాటికి శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ ఎక్కడ కాపురం ఉంటే అక్కడ సంక్షోభం క్షామం తాండవిస్తాయని అన్నారు. తాడేపల్లిలో కాపురం తర్వాత విజయవాడ పెద్ద పల్లెటూరు అయ్యిందని, ఇపుడు సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం అంటున్నాడని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పథంలో ఉన్న విశాఖకు విజయవాడ పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే డీఎస్పీల నియామకం జరిగింది. ఉత్తరాంధ్రలో ఒకే వర్గానికి చెందిన వారిని నియమించారు. ఓ మాఫియాను తయారు చేయడానికి ప్లాన్ లో భాగమే ఈ నియామకాలు. పేదోడు ఇంకా పేదోడవ్వడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి’’ అని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఇంకా చదవండి
మణిపూర్‌లో తెలుగు విద్యార్థుల్ని సర్కారే రక్షించాలి - నారా లోకేష్ డిమాండ్
మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో అక్కడ ఎన్ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారని, వారిని తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణలతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే పరస్పర దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనలో పడింది.
వివిధ యూనివర్సిటీలు, ఎన్ఐటీల్లో వందలాది మంది ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరి భద్రత విషయమై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చిందని, ఏపీకి చెందిన విద్యార్థులు వేర్వేరు క్యాంపస్‌లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా చదవండి
మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ, ఈసారి వరంగల్‌లో టూర్
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణ అధికారం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు కర్ణాటక ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు.. ఇక తెలంగాణపై ఫోకస్ చేయనున్నారు. సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో.. ఆ మరుసటి రోజున తెలంగాణకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు కర్ణాటకలో గెలుపు కీలకం అని అక్కడ ఓట్ల పొందే ఏ అవకాశాన్ని వదులుకోరాదనే వ్యూహం మేరకే సరిహద్దుల్లో సభ నిర్వహించే యోచన ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల కోడ్ తో ఇబ్బంది లేకుండా జహీరాబాద్, నారాయణపేట్ లేదా మరోచోట సభ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు అనేక వ్యూహాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శల దాడిని కొనసాగించడంతో పాటు కేంద్రమంత్రులు, ముఖ్య నేతల పర్యటనల ద్వారా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. కేంద్ర పథకాల ద్వారా వివిధ రంగాల్లో రాష్ట్రానికి కేటాయించి నిధులు, ప్రజలకు కల్గిన లబ్ధి తదితర అంశాలను క్షేత్రస్థాయిలో వివరించాలని నిర్ణయించారు. ఇంకా చదవండి
వైఎస్ఆర్‌సీపీలో అన్ని సమస్యలకూ ఐ ప్యాకే కారణమా ?
ఆంద్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులైన వారు, వైసీపీ అంటే ఎనలేని అభిమానం చూపేవారు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్‌తో హైకమాండ్‌కు దూరం పెరిగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాలు ఓ కుదుపు కుదిపేయగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి పరిస్థితి వచ్చింది. పార్టీ నేతల్లో బయటపడని అసంతృప్తి కనిపిస్తోందని గుసగుసలు ఎక్కవగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం సీఎం జగన్ ఎక్కువగా ఆధారపడుతున్న ఐ ప్యాక్ అన్న మాట మాత్రం ఐ పార్టీలో ఏకగ్రీవనంగా వినిపిస్తోంది. మొత్తం ఐ ప్యాక్ డామినేషన్ వల్లే సమస్య వస్తోందని ఆ పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారు. ఇంకా చదవండి