అన్వేషించండి

Top Headlines Today: ఏపీ రాజకీయాల్లో సమూల మార్పు; బీఆర్ఎస్‌ మౌనం దేనికి సంకేతం? - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఏపీ రాజకీయాల్లో సమూల మార్పు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హు కిల్డ్ బాబాయ్ అనేది పాత బడిపోయిన స్లోగన్. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అంటూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఉన్న అంశాలు అనేకానేక సందేహాలు తావిచ్చేలా ఉండటం న్యాయవాదులు అంతా ఈ చట్టం గురించి విశ్లేషించి అంతిమంగా లోపభూయిష్టమని.. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని తేల్చడంతో ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ చట్టంపై విపక్షాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. చట్టాన్ని గ్రామాల్లో రచ్చబండల మీద చర్చకు పెడుతున్నారు. దీంతో ఈ చట్టంపై ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. వాటిని తీర్చేందుకు ప్రభుత్వానికి సమయం ఉండటం లేదు. అమల్లో ఉందని ఒకరు.. అమల్లో లేదని మరొకరు.. వెనక్కి తగ్గేది లేదని మరో మంత్రి ప్రకటనలు చేస్తూండటం గందరగోళానికి కారణం అవుతోంది. ఇంకా చదవండి

టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఫిర్యాదు, సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్న రెండు అంశాలలో ఒకటి పెన్షన్ పంపిణీ కాగా, రెండో విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ, బ్యాంకు ఖాతాల్లో పిన్షన్ నగదు జమపై అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్షపార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ల్యాండ్ టైటిలంగ్ యాక్ట్ పై, ఇదే విషయంలో సీఎం జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీడీపీ చేస్తున్న ప్రచారంపై విచారణకు సీఐడీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తెచ్చిన చట్టాలపై దుష్ప్రచారం చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చదవండి

హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేశాయని  బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు.  హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారని..   రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి

బీఆర్ఎస్ మౌనం దేనికి సంకేతం ?

పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెల్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. ఆ సెంటిమెంట్ అస్త్రాల్లో ఒకటి హైదరాబాదా. హైదరాబాద్ ను యూటీ చేస్తారని.. దాన్ని అడ్డుకునే శక్తి   బీఆర్ఎస్ కే ఉందని కేటీఆర్ ప్రతీ చోటా చెబుతున్నారు   అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఆ రెండు పార్టీలను దాటి ఓటర్లు బీఆరెస్‌కు ఓటువేసేలా ఈ వ్యూహం పని చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రజల్లో దీనిని హాట్ టాపిక్ చేసేలా సఫలం కాలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంకా చదవండి

రాయ్‌బరేలీ బరిలో రాహుల్‌ని నిలబెట్టడం సేఫ్‌గేమా?

ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగింది. ఇప్పుడు జరగాల్సింది చూద్దాం అనే ధోరణిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే చాలా వరకూ డక్కాముక్కీలు తింటూ వచ్చింది. ఇది "గాంధీల" పార్టీ అన్న మరకను తుడిచేందుకూ గట్టిగానే ప్రయత్నించింది. అందుకే మల్లికార్జున్ ఖర్గేని రంగంలోకి దింపి పార్టీ అధ్యక్షుడిని చేసింది అధిష్ఠానం. ఈ నిర్ణయంతో పెద్దగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఢిల్లీ పెద్దల చేతుల్లోనే పార్టీ ఉందన్న అపవాదు అయితే పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీ సిద్ధాంతాన్ని, ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇంకా జాతీయ స్థాయిలో మాత్రం వెనకబడే ఉంది కాంగ్రెస్. ఇంకా చదవండి

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. రెండు భారత సైనికుల వాహనాలపై శనివారం నాడు ఉగ్రవాదులు దాడి చేశారు.  అందులో ఒకటి భారత వైమానిక దళానికి (IAF) చెందింది. ఈ ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ ప్రాంతంలోని సనాయి టాప్‌కు ఆర్మీ వాహనాలు వెళ్తుండగా సాయంత్రం Shahsitar సమీపంలో ఉగ్రవాడులు ఒక్కసారిగా కాల్పుల జరిపారు. ఈ దాడిలో గాయపడిన జవాన్లను వైద్య చికిత్స సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఇంకా చదవండి

సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌, ప్రభాస్‌ లేకుడానే సలార్‌ 2 షూటింగ్‌?

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌, 'కేజీయఫ్'‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'సలార్‌'. గతేడాది డిసెంబర్‌ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టింది. 'బాహుబలి' తర్వాత వరుస ప్లాప్స్‌ చూస్తున్న ప్రభాస్‌కు ఈ చిత్రం ఆ రేంజ్‌ హిట్‌ను అందించింది. దీంతో సలార్‌ మూవీ ప్రభాస్‌కు, ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా మారింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్‌ 2కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందరి, వీలైనంత త్వరగా షూటింగ్‌ మొదలు పెడతామని ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. ఇంకా చదవండి

'వార్‌ 2' నుంచి క్రేజీ అప్‌డేట్

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా 'వార్‌ 2'మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్‌ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఇప్పటికి వార్‌ 2 సెట్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ లీక్‌ అయ్యంది. దానికి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. వార్ 2 అంటేనే  హై వోల్టేజ్‌ యాక్షన్‌. ఈ యాక్షన్‌ మూవీతో తారక్‌ లుక్‌ ఎలా ఉంటుందా? చూసేందుకు ఫ్యాన్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని ఖుషి చేసే ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. వార్‌ 2లోని ఎన్టీఆర్‌ లుక్‌ అప్‌డేట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంకా చదవండి

ఎయిర్‌ ఇండియా కొత్త రూల్‌ - ఆ బరువు 15 కేజీలు దాటకుండా చూసుకోండి

టాటా గ్రూప్‌లోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొత్త రూల్‌ తీసుకొచ్చింది, తన ప్యాసెంజర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. లగేజీ పాలసీని మార్చి, ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గించింది. ఇప్పుడు, ఎయిర్ ఇండియాలో లగేజీని తీసుకెళ్లడం కాస్త ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇంకా చదవండి

చెలరేగిన డుప్లెసిస్, కోహ్లీ- బెంగళూరు హ్యాట్రిక్ విజయం

గుజరాత్‌(GT)పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో... తర్వాత బ్యాట్‌తో రాణించిన బెంగళూరు గుజరాత్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని38 బంతులు మిగిలి ఉండాగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ కీలకమైన మ్యాచ్‌లో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. తరువాత బరిలో దిగిన బెంగళూరు మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్‌ 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసి  విధ్వంసం సృష్టించాడు. విరాట్ కోహ్లీ  27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో జోష్ లిటిల్ 4, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget