అన్వేషించండి
Advertisement
IPL 2024: చెలరేగిన డుప్లెసిస్, కోహ్లీ- బెంగళూరు హ్యాట్రిక్ విజయం
RCB vs GT, IPL 2024: బెంగళూరు హ్యాట్రిక్ విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇచ్చిన లక్ష్యాన్ని బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలో ఛేదించింది.
RCB vs GT IPL 2024 Royal Challengers Bengaluru won by 4 wkts: గుజరాత్(GT)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో... తర్వాత బ్యాట్‌తో రాణించిన బెంగళూరు గుజరాత్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని38 బంతులు మిగిలి ఉండాగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కీలకమైన మ్యాచ్‌లో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. తరువాత బరిలో దిగిన బెంగళూరు మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్ 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. విరాట్ కోహ్లీ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో జోష్ లిటిల్ 4, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
రాణించారు.
రాణించారు.
ప్రారంభం నుంచే కట్టడి
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు... పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ నిర్ణయం సరైందేనని కాసేపటికే అర్థమైంది. ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్వప్నిల్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లో కేవలం ఒకే పరుగు వచ్చింది. రెండో ఓవర్‌లోనే గుజరాత్‌కు షాక్ ఇచ్చింది. ఏడు బంతుల్లో ఒక పరుగు చేసిన వృద్ధిమాన్ సాహాను మహ్మద్ సిరాజ్ వేశాడు. కీపర్ దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి... సాహా అవుటయ్యాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ తొలి మూడు ఓవర్లలో ఏడు పరుగులే చేయగలిగింది. నాలుగో ఓవర్‌లో సిరాజ్ మరో వికెట్ తీశాడు. శుభ్‌మన్ గిల్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. రెండు పరుగులకే గిల్ అవుట్ అయ్యాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఆరో ఓవర్‌లో మరో వికెట్ పడింది. సాయి సుదర్శన్ అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లేలో గుజరాత్ కేవలం 23 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే.
19 పరుగులకే మూడూ వికెట్లు కోల్పోయిన డేవిడ్ మిల్లర్, షారూఖ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో కాస్త కుదురుకున్నాక స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దీంతో పదో ఓవర్‌లో గుజరాత్ 50 పరుగుల మార్క్ దాటింది. నాలుగో వికెట్‌కు విలువైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 20 బంతుల్లో 30 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్ అవుట్ కావడంతో గుజరాత్‌కు మరో షాక్ తగిలింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో మిల్లర్, తర్వాత వెంటనే షారూఖ్ ఖాన్ అవుటయ్యాడు. 16వ ఓవర్‌లో తెవాటియా దాటిగా ఆడాడు. కానీ యష్ దయాల్ వేసిన ఓవర్‌లో రషీద్ ఖాన్ అవుటయ్యాడు. 18 పరుగులు చేసి రషీద్, 21 బంతుల్లో 35 పరుగులు చేసి తెవాటియా అవుటయ్యారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు, యష్ దయాల్ రెండు, విజయ్ కుమార్ రెండు వికెట్లు తీశారు. దీంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion