By: ABP Desam | Updated at : 26 Sep 2023 12:16 PM (IST)
అయ్యో దేవుడా, పండుగకు పిలిచి ప్రాణాలు తీశామే !
Medak News: ఇంట్లో పండుగ. ఇంటి పెద్దాయన బంధువులందరినీ పిలిచాడు. బావమరుదులు, ఆడబిడ్డలు, వారి పిల్లలు అందరని ఆహ్వానించాడు. అందరూ కలిసి పండుగ సంతోషంగా జరుపుకున్నారు. ఇంక ఎవరి ఇళ్లకు వారు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ ఇంట్లోని మహిళలు దుస్తులు ఉతుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అదే వారి పాలిట మృత్యుపాశమైంది. వారితో పాటు వచ్చిన పదేళ్ల బాలుడు నీట మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు మహిళలు నీట మునిగి మృత్యువాత పట్టారు. వారి మృతదేహాలను చూసి ఇంటి సభ్యుల రోదన వర్ణణాతీతం. పండుగకు పిలిచి ఇంత మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నానే, మిమ్మల్ని పిలవపోయిన బతికి ఉండేవారు అంటూ గుండెలు పగిలేలా రోదించారు. ఇది చూసిన స్థానికులు సైతం బోరుమంటూ విలపించారు.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. అతన్ని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో జరిగింది. బాలుడి ఆచూకీ లభించలేదు. మనోహరాబాద్ ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, స్థానికులు వివరాల మేరకు.. రంగాయపల్లికి చెందిన ఫిరంగి చంద్రయ్య ఇంట్లో ఆదివారం బోనాల పండగ నిర్వహించారు. ఇందుకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేటకు చెందిన తన బావమరుదులు దొడ్డు యాదగిరి, దొడ్డు శ్రీకాంత్‌ల కుటుంబాన్ని ఆహ్వానించారు. ఆదివారం కుటుంబం మొత్తం పండుగను సంతోషంగా జరుపుకున్నారు. అందరూ సొంత ఊర్లకు వెళ్లాల్సింది.
ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉండంతో దుస్తులు ఉతికేందుకు సోమవారం దగ్గలోని చెరువు వెద్దకు వెళ్లాలని అనుకున్నారు. యాదగిరి భార్య బాలమణి(35), వీరి కుమారుడు చరణ్ (10), శ్రీకాంత్ భార్య లక్ష్మి (30), ఫిరంగి చంద్రయ్య భార్య లక్ష్మి, వీరి కుమార్తె లావణ్య(18)లు దుస్తులు ఉతికేందుకని గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లారు. చరణ్ నీటిలో దిగి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో మునిగిపోయాడు. గమనించిన బాలుడి తల్లి బాలమణి కుమారుడిని కాపాడేందుకు చెరువులో దూకింది. ఆమెకు ఈత రాకపోవడంతో నీట మునిగింది. వారిద్దరిని రక్షించేందుకు దొడ్డు లక్ష్మి, లావణ్య సైతం నీటిలోకి దిగారు. అయితే వారికి కూడా ఈత రాకపోవడంతో వారు సైతం నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న చంద్రయ్య భార్య ఫిరంగి లక్ష్మి వారిని కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
వారి అరుపులు విన్న స్థానికులు చెరువు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫిరంగి లక్ష్మిని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని దొడ్డు లక్ష్మి, దొడ్డు బాలమణి, ఫిరంగి లావణ్య మృతదేహాలను బయటకు తీశారు. చరణ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. బోనాల పండగ రోజు ముగ్గురు మృత్యువాతపడటంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగకు పిలిచి ప్రాణాలు తీశానే అంటూ చంద్రయ్య, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచి వేశాయి. ప్రమాద స్థలాన్ని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరి, సీఐ శ్రీధర్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
Babu Gogineni: మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలా? బాబు గోగినేని దిమ్మతిరిగే సమాధానం
ఉద్యమకారులకు శుభవార్త, కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం
CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?
Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?
/body>