అన్వేషించండి

TRS MLC : 12 ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమే.. పోటీకి సిద్దంగా లేని ఇతర తెలంగాణ పార్టీలు !

తెలంగాణలో జరుగుతున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీకి ఇతర పార్టీల్లో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

తెలంగాణలో జరుగుతున్న 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవం అయ్యే  అవకాశం ఉంది. ఇతర పార్టీలు పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. నిజానికి 12 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్‌కు విజయం సాధించడానికి అవసరమైన స్పష్టమైన బలం ఉంది. అయితే అదే సమయంలో కనీసం నాలుగైదు చోట్ల కనీసం పోటీ ఇవ్వడానికి అవకాశం ఉన్న స్థాయిలో ఇతర పార్టీలకు ప్రతినిధులు ఉన్నారు. కానీ పోటీ  చేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 

Also Read: Mlc Elections: టీఆర్ఎస్ స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు...!

ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అధినేత మత్రమే అభ్యర్థుల్ని ప్రకటించి బీఫాం ఇచ్చారు. ఇతర పార్టీల్లో అభ్యర్థులపై ఎలాంటి చర్చ జరగలేదు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఓ కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో కల్వకుంట్ల కవిత పోటీ చేసినప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి కాంగ్రెస్ పోటీ పెట్టింది. నల్లగొండ, ఖమ్మం వంటి చోట్ల పోటీ చేయడానికి తగినంత బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది.

Koo App
ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం... *ఎమ్మెల్సీ స్థానానికి మొండితోక అరుణ్ కుమార్ తరఫున ప్రతిపాదకులు గాదెల వెంకటేశ్వరరావు(నందిగామ జెడ్ పి టి సి) ఈరోజు ఒక సెట్ నామినేషన్ జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత కు దాఖలు... *ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్ సి పి అభ్యర్థి తలశిల రఘురాం తరఫున చెన్ను ప్రసన్నకుమారి (విజయవాడ రూరల్ ఎంపీపీ) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు... - Cowsar Azmatullah @ రిపోర్టర్ (@Cowsar_Azmatullah) 20 Nov 2021

 

Also Read: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

కానీ ఆ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదు. పోటీ చేయడం వల్ల గెలిచే అవకాశం ఎలాగూ ఉండదు.. మళ్లీ సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్ ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో  అభ్యర్థిగా నిలబడాలంటే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవాలి. ఓటు వేయాంటే సొంత పార్టీ ప్రజాప్రతినిధులకైనా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే పెద్దగా పోటీ చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ కారణాలతో టీఆర్ఎస్‌కు అన్ని స్థానాలూ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: TSRTC: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్

ఇప్పటికి మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే సభ్యుడిగా ఉన్నారు. ఆయన పట్టభద్రుల కోటా నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు రామచంద్రరావు కూడా ఇటీవల జరిగిన పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆ పార్టీకి తెలంగాణలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మండలిలో టీఆర్ఎస్‌కు తిరుగులేనంత ఆధిపత్యం ఉంది.  

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget