అన్వేషించండి

SIT Notices : జగ్గూస్వామి చుట్టూ సిట్ వల - మరో ఐదుగురికి నోటీసులు !

ఎమ్మెల్యేలకు ఎర కేసులో జగ్గూ స్వామి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన సన్నిహితులు ఐదుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది.

 

SIT Notices :  ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ సిట్ మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడితో పాటు సిబ్బందికి నోటీసులిచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌కు నోటీసులు జారీ చేసింది. జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్.. ఈసారి కూడా హాజరుకాకపోతే 41-ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించింది.

నందకుమార్ భార్యతో పాటు ప్రతాప్ అనే లాయర్‌ విచారణ 

ఇప్పటికే నందకుమార్ భార్యతో పాటు మరో లాయర్ ప్రతాప్‌కూ సిట్ నోటీసులు జారీ చేసింది.  సిట్‌ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్‌ హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ దర్యాప్తునకు ప్రతాప్‌ సహకరించాలని  ప్రతాప్‌ను అరెస్టు చేయరాదని సిట్‌ను హైకోర్టు ఆదేశిచింది.   ఈ కేసులో సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పేరును  నిందితుల జాబితాలో చేర్చింది.  జగ్గుస్వామి, తుషార్‌ వెళ్లపల్లి,  న్యాయవాది బీ శ్రీనివాస్‌ను కూడా నిందితులుగా సిట్‌ చేర్చింది. ఈ మేరకు సిట్‌ కేసులను విచారించే ఏసీబీ కోర్టుకు నివేదిస్తూ మెమో దాఖలు చేసింది. 

జైల్లో ఉన్న నిందితుల్ని మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ 

రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ ఇప్పటికే అరెస్టయ్యారు. వీరు  గత 25 రోజులుగా జైల్లో ఉన్నారు.ముగ్గురు నిందితులు మాట్లాడిన ఆడియో, వీడియోల్లో పలుమార్లు బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌ పేర్లు ప్రస్తావించినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్‌ హైకోర్టు విచారణ సందర్భంగా చెప్పింది. అయితే ఈ ముగ్గుర్ని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలనుకున్న సిట్ ప్రయత్నాలు ఫలించలేదు.  ముగ్గురు నిందితులను సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇచ్చినందున సిట్‌ అభ్యర్థనను ఆమోదించలేకపోతున్నట్టు ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్‌ తెలిపారు.  

ముగ్గురు చెప్పిన సమాచారంతోనే సంతోష్‌ను నిందితునిగా చేర్చిన సిట్ 

జైల్లో ఉన్న ముగ్గురి నుంచి సేకరించిన సమాచారం మేరకు సిట్‌ అధికారులు బీఎల్‌ సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్‌ వెల్లపల్లికి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. కేరళలో సోదాల్లోనూ జగ్గుస్వామి, తుషార్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఇద్దరికి ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు సైతం జారీచేశారు. ఈ నెల 26 లేదా 28న సిట్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని బీఎల్‌ సంతోష్‌కు సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది.   బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌తోపాటు శ్రీనివాస్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంతో ఈ కేసులో కీలక మలుపులు ఉండబోతున్నాయని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget